
హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రచారంలో అపశృతి చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ నగర పాలక సంస్థలో బీఆర్ఎస్ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో డీజే వాహనం అదుపుతప్పి ప్రచారంలో కార్యకర్తలపైకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా.. ఇద్దరికి తీవ్రగాయలు అయ్యాయి. చనిపోయిన ఉప్పల్ కు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త శ్రావణ్ గా గుర్తించారు. ప్రచారంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మా రెడ్డి పాల్గొన్నారు.