
బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ అంటేనే బిల్లారంగాల సమితి..హరీశ్, కేటీఆర్ లు బిల్లారంగాలని విమర్శించారు. బీజేపీ రాజ్యాంగం మారుస్తామంటే బీఆర్ఎస్ ఎందుకు స్పందిస్తలేదని ప్రశ్నించారు. ఖార్ఖానాకు పోయిన కారును తూకానికి అమ్మాల్సిందేనని కామెంట్ చేశారు. అందుకే కేసీఆర్ బస్సు యాత్ర చేస్తుండని విమర్శించారు. సిరిసిల్లలో జరిగిన కాంగ్రెస్ పార్టీ జనగర్జన సభలో సీఎం రేవంత్ రడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
మోదీ ప్రధాని అయ్యాక గుజరాత్ తప్ప ఏనాడు తెలంగాణను పట్టించుకోలేదని అన్నారు. పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వాలని బీజేపీ ఆలోచన చేయలేదని చెప్పారు. బండి సంజయ్, వినోద్ రావులు తెలంగాణకు ఏమి తేలేదు, ఏమి చెయ్యలేదని తెలిపారు. డిసెంబర్ లో జరిగినవి సెమీ ఫైనల్స్..బీఆర్ఎస్ ను బొంద పెట్టినమని రేపు జరగబోయే ఫైనల్స్ లో మోదీ, అమిత్ షాలను ఓడించాలని సూచించారు.
మోదీ తెలంగాణకు రావాల్సిన హక్కులపై నిర్లక్ష్యం వహించారని చెప్పారు. తెలంగాణకు అన్యాయం చేసిన మోదీకి తెలంగాణలో ఓటు అడిగే హక్కు లేదన్నారు. రాజ్యాంగం మార్చేందుకు రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తుంటే ట్విట్టర్ టిల్లు ఎందుకు ప్రశ్నించట్లేదని ఫైర్ అయ్యారు. రాజ్యాంగాన్ని మార్చాలని 2020లోనే మోదీ, కేసీఆర్ ఇద్దరు ప్లాన్ చేసుకున్నారని ఆరోపించారు.
రిజర్వేషన్లు రద్దుచేస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్లకు పట్టిన చీడను వదిలిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మోదీ కేడీ కలిసి సర్కార్ పైన కుట్రలు చేస్తున్నారని పదేండ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని అన్నారు. నల్లమల్ల అడవి నుంచి వచ్చామని అంత ఆశామాశిగా పోమని అన్నారు. కరీంనగర్ ఎంపీగా వెలిచాల రాజేందర్ ను గెలిపించండని కోరారు.