18నెలలుగా జీతం రాకపోవడంతో.. లెక్చరర్ ఆత్మహత్య

18నెలలుగా జీతం రాకపోవడంతో.. లెక్చరర్ ఆత్మహత్య

నాగర్ కర్నూల్ జిల్లా: ఒకటి కాదు రెండు కాదు.. 18 నెలలుగా జీతం రావడం లేదు.. కనీసం రెనివల్స్ కూడా రావడం లేదు... ఎక్కడా అప్పు పుట్టే పరిస్థితి కనిపించడం లేదు.. చేసిన అప్పులు తీర్చలేక మనో వేదనతో ఓ యువ గెస్ట్ లెక్చరర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వెల్దండ జూనియర్ కళాశాలలో బాటనీ గెస్టు లెక్చరర్ గా పని చేస్తున్న గణేష్  18 నెలలైనా జీతాలు రాకపోవడం, కనీసం రినివల్స్ రాకపోవడంతో మనోధైర్యాన్ని కోల్పోయాడు. సూసైడ్ చేసుకొని కొద్దిసేపటి క్రితం మరణించారు. 
ఇది ప్రభుత్వ హత్యే.. గణేష్ కుటుంబాన్ని ఆదుకోవాలి
18 నెలలుగా జీతం రాకపోతే ఎలా బతకాలి.. ఎంత కష్టం.. కష్టాలు భరించే ఓపిక లేక గెస్ట్ లెక్చరర్ గణేష్ ఆత్మహత్యకు పాల్పడడం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యగా భావించాలని తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలల అతిథి అధ్యాపకుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తెలంగాణ అతిథి అధ్యాపకుల JAC రాష్ట్ర అధికార ప్రతినిధి దేవేందర్ యాదవ్ కుంట ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరచి మా ప్రాణాలు పోకుండా కాపాడాలని, మిత్రుడు గణేష్ కుటుంబానికి 10 లక్షల పరిహారం చెల్లించి, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.