Kannappa Bookings: ‘కన్నప్ప’ రిలీజ్కు సర్వం సిద్ధం.. టికెట్ బుకింగ్స్ ఓపెన్

Kannappa Bookings: ‘కన్నప్ప’ రిలీజ్కు సర్వం సిద్ధం..  టికెట్ బుకింగ్స్ ఓపెన్

శివ భక్తుడి గొప్ప పురాణ కథగా కన్నప్ప మూవీ వచ్చేస్తోంది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ‘కన్నప్ప’ శుక్రవారం (జూన్ 27న) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా నేడు (జూన్ 25న) కన్నప్ప అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు మేకర్స్. రిలీజ్కు 2 రోజుల ముందుగా బుకింగ్స్ సైట్ అందుబాటులోకి తీసుకొచ్చారు మేకర్స్. ఈ మేరకు కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ బుకింగ్స్ వివరాలు వెల్లడించారు. 'భక్తిని అనుభూతి చెందండి. పురాణాన్ని సాక్షిగా చేసుకోండి. కన్నప్ప కోసం ముందస్తు బుకింగ్‌లు ఇప్పుడే మొదలయ్యాయి. వెంటనే బుక్ చేసుకోండి' అని మేకర్స్ తెలిపారు. 

కన్నప్ప మూవీలో విష్ణు తిన్నడు పాత్ర పోషించనున్నారు. తల్లీతండ్రి తప్ప మరో దైవం లేరని చెప్పేవాడు తిన్నడు. ఆ తిన్నడు కన్నప్పగా ఎలా మారాడన్నదే ఈ మూవీ కథ. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే విష్ణు అందించడం విశేషం.

►ALSO READ | Vishwambhara: విశ్వంభర ఐటమ్ భామ ఫిక్స్.. చిరుతో చిందేసేది ఈ హాట్ బ్యూటీనే!

ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, మధుబాల వంటి బిగ్ స్టార్స్ నటించారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల పై మంచు మోహన్ బాబు సుమారు రూ.200 కోట్ల బడ్జెట్తో కన్నప్ప తెరకెక్కించారు.