
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో రిలీజ్‌కు రెడీగా ఉన్న మూవీ విశ్వంభర. ఈ మూవీ 90% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇంకా ఐటెం సాంగ్ ఒక్కటే బ్యాలన్స్. ఇక నిన్నమొన్నటి వరకు ఈ స్పెషల్ సాంగ్ చేసేందుకు హీరోయిన్ దొరకడం లేదని వార్తలు వచ్చాయి. ఇపుడీ ఈ సమస్యకు పరిష్కారం లభించిందనే అప్డేట్ వినిపిస్తోంది.
చిరుతో స్టెప్పులు వేయడానికి కన్నడ బ్యూటీ నిశ్విక నాయుడును మేకర్స్ లాక్ చేసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. కన్నడ సినిమాలు ఫాలో అయ్యేవాళ్ళు ఈ అమ్మడిని బాగా గుర్తుపడతారు. ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ ఉన్నప్పటికీ.. ఈ బ్యూటీనే ఎంచుకోవడం ఇపుడు ఆసక్తిగా మారింది. మరి పెద్దగా పాపులారిటీ లేని నిశ్విక వెనకున్న దర్శకుడు వశిష్ఠ స్ట్రాటజీ ఏంటో? అనేది తెలియాల్సి ఉంది.
నిజానికి ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కానీ, ఈ ఒక్క పాటను భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేస్తున్నట్లు టాక్. ఇది కూడా మేకర్స్ ఆఫీషియల్‌గా చెప్పలేదు. టీమ్ దాచిపెడితే లీకైపోయింది. దీనిపై యువీ క్రియేషన్స్ సమర్థిస్తూ, ఖండిస్తూ ఎలాంటి ప్రకటన చేయలేదు.
►ALSO READ | SS Rajamouli: వీడియో గేమ్ ప్రపంచంలోకి రాజమౌళి.. గ్లోబల్ ఐకాన్‌గా జక్కన్న గుర్తింపు
ఫోక్ సాంగ్స్, భీట్ సాంగ్స్ చేయడంలో భీమ్స్కు అంటూ ఓ ప్రత్యేకత ఉంది. ధమాకా, మ్యాడ్, సంక్రాంతికి వస్తున్నాం లాంటి చిత్రాలకు తన మ్యూజిక్ ఎంతో ప్లస్ అయింది. ప్రస్తుతం చిరు- అనిల్ రావిపూడి చిత్రంతో పాటు మాస్ జాతర, డెకాయిట్, టైసన్ నాయుడు లాంటి చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడిక ‘విశ్వంభర’లో ఈ స్పెషల్ సాంగ్ వరుసలో చేరింది. మరి ఏరికోరి మెగాస్టార్ కోసం కంపోజ్ చేయిస్తున్న ఈ మాస్ సాంగ్ ఎలా మేజిక్ చేయబోతోందో అనే ఆసక్తి నెలకొంది. ఇక విశ్వంభర సాంగ్ తో నిశ్విక క్లిక్ ఐతే.. టాలీవుడ్లో సెటిల్ అవ్వడం కాన్ఫర్మ్!
ఎవరీ నిశ్విక నాయుడు:
2018లో వచ్చిన 'అమ్మ ఐ లవ్ యు' (బిచ్చగాడు కన్నడ రీమేక్)తో నిప్సిక సినీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటిదాకా తొమ్మిదికి పైగానే సినిమాలు చేసింది. గతేడాది శివరాజ్ కుమార్, ప్రభుదేవాల 'కరటక దమనక'లో నటించింది. ఆమె "వాసు నాన్ పక్కా కమర్షియల్", "అమ్మ ఐ లవ్ యు", "గాలి పటం 2", "గురు శిష్యుడు", "దిల్ పసంద్" వంటి చిత్రాలలో నటించి గుర్తింపు పొందింది. పుట్టి పెరిగింది, చదివింది అంతా బెంగళూరులోనే, కానీ ఈ అమ్మడిది తెలుగు మూలాలున్న కుటుంబం.
విశ్వంభర 2025 సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. జూలై 24న విడుదల అవుతుందని వార్తలు వచ్చినప్పటికీ, ఇప్పుడు సెప్టెంబర్ 25న రానుందని టాక్ ఉంది. కానీ, పవన్ కళ్యాణ్ OG, బాలకృష్ణ అఖండ 2 సినిమాలు కూడా సెప్టెంబర్ 25న రేలి కానున్నాయి. అందువల్ల, విశ్వంభర మరో డేట్ ఫిక్స్ చేసుకునే ఛాన్స్ ఉంది.