ఆ టైంలో SBI డిజిటల్ లావాదేవీలు పని చేయవు

ఆ టైంలో SBI డిజిటల్ లావాదేవీలు పని చేయవు

ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తన ఖాతాదారులకు ముఖ్యమైన అలెర్ట్ ఇచ్చింది. ఆగష్టు 6,7 మధ్య తేదీల్లో కొన్ని గంటల పాటు డిజిటల్ లావాదేవీలు పని చేయవని తెలియజేసింది.

మెరుగైన బ్యాంకింగ్ సేవల కోసం  మైంటైనెన్స్ పనులు జరుగుతున్నాయని.. దీంతో కస్టమర్లు తమకు సహకరించాలని SBI ట్విట్టర్ వేదికగా కోరింది. డిజిటల్ బ్యాంకింగ్ ఫ్లాట్‌ఫార్మ్స్ అయిన యోనో, యోనో లైట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో బిజినెస్ సేవలు ఆగష్టు 6వ తేదీ రాత్రి 10.45 గంటల నుంచి ఆగష్టు 7వ తేదీ తెల్లవారుజాము 1.15 గంటల వరకు పని చేయవని ఈ విషయాలను గుర్తించికోవాలని కస్టమర్లను SBI సూచించింది.