అందుకే చదువుకోమన్నది : అది టు లెట్.. టు లేట్ కాదు

అందుకే చదువుకోమన్నది : అది టు లెట్.. టు లేట్ కాదు

బెంగుళూరు అనగానే వెంటనే గుర్తొచ్చేది హెవీ ట్రాఫిక్ జామ్ లు, భారీ అద్దెలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. కొన్నిసార్లు పదాల్లో అక్షర దోషం లేదా అక్షరాలు మిస్ అవడం వల్ల భారీ తేడాలోస్తాయి. అదే తరహాలో ఓ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టర్‌లో "టు-లేట్ రెంట్/సేల్ 1 RK, 1,2,3 BHK అని రాసి ఉంది. అక్షర దోషంతో ఉన్న పోస్టర్ చిత్రాన్ని ఓ X యూజర్ స్కై అబ్సెసెడ్ షేర్ చేశారు. దాంతో పాటు బెంగళూరులో మంచి ఇళ్లను మీరు ఎప్పుడూ లేట్ అవుతారు అని క్యాప్షన్ లో రాశారు.

ఈ పోస్టర్ లో టు-లెట్ కాస్తా టు-లేట్ గా రూపాంతరం చెందింది. ఇది సరసమైన డ్రీమ్ ఫ్లాట్‌లు లంచ్‌టైమ్‌లో దోసెల కంటే త్వరగా కనుమరుగవుతాయనే రిమైండర్ ను సూచిస్తుంది. నిజానికి ఇందులో అక్కడ ఉన్న స్పెల్లింగ్ లో తప్పేం లేదు. అది నగరంలో అద్దె ఇండ్లతో ఉన్న తీవ్రమైన కష్టాన్ని ప్రతిబింబించేలా దీన్ని ఏర్పాటు చేశారు. కానీ ఇది ఇప్పుజు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది.

అంతకుముందు, ఇందిరానగర్‌లోని 2BHK ఫ్లాట్ అద్దెను ఒక యజమాని కొన్ని గంటల్లోనే రూ.10వేలకు ఎలా పెంచాడో చూపించే పోస్ట్ ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. ఆకస్మికంగా అద్దె పెంచడం అనేది ఈ పోస్ట్ లో హైలెట్ గా నిలిచింది.