
గ్రూప్ 1అభ్యర్థులకు కీలక ప్రకటన చేసింది టీఎస్పీఎస్సీ. ఆఫ్ లైన్ విధానంలోనే గ్రూప్ 1 పరీక్ష ఉంటుందని ప్రకటించింది. ఓఎంఆర్ పద్ధతిలో ఆఫ్ లైన్ లోనే పరీక్ష నిర్వహిస్తున్నట్టు తెలిపారు టీఎస్పీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్.
మొత్తం 563 పోస్టులకు గ్రూప్ 1 పరీక్ష జరగనుంది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 16వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.మొత్తం 4.03లక్షల మంది అభ్యర్థులు గ్రూప్ 1 పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది.