
డాక్టర్లు ప్రాణాలు కాపాడే దేవుళ్లని, హాస్పిటల్ ని గుడిగా భావించే ఆసుప్రతిలో సిబ్బంది వాళ్ల డ్యూటీలు మరిచిపోయి.. పేషంట్లకు ఇబ్బంది కలిగించారు. ఒకరికి చెప్పాల్సిన నర్సులే.. బ్యాండ్ వాయిస్తే స్టెప్పులేశారు. ఓ గవర్నమెంట్ హాస్పిటల్ లో రోగులు ఇబ్బంది పడుతున్నా పెద్ద పెద్ద డప్పుల శబ్ధాలకు డాక్టర్లు, సిబ్బంది కలిసి చిందులేశారు. ఆ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో నెటిజన్లు హాస్పిటల్ సిబ్బందిపై మండిపడుతున్నారు.
#हापुड़ के सरकारी अस्पताल (CHC) में जमकर उड़ाई गई नियमो की धज्जियां। अस्पताल में बजे ढोल नगाड़े। अस्पताल के डॉक्टर/कर्मी नाचते रहे मरीज चिल्लाते रहे। @MhfwGoUP @nhm_up @UPGovt @CMOfficeUP @brajeshpathakup @myogioffice @MoHFW_INDIA pic.twitter.com/Cf7gja0ofr
— Naveen Gautam (दैनिक भास्कर, जिला प्रभारी हापुड़) (@AajhapurNaveen) April 30, 2024
ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్‌లోని పనిచేసే మహిళా రిటైర్డ్ అయింది. దీంతో హాస్పిటల్ సిబ్బంది ఆమెకు వీడ్కోలు పలికేందుకు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెద్దగా డ్రమ్స్ వాయించగా డాక్టర్లు, వైద్య సిబ్బంది డ్యాన్సు చేశారు. ఆ ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులు చాలా ఇబ్బంది పడ్డారు. ఆ డాక్టర్లు, సిబ్బంది తీరుపై పై అధికారులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో రోగులను పట్టించుకోకుండా డాక్టర్లు, సిబ్బంది డ్యాన్సులు చేయడంపై నెటిజన్లు మండిపడ్డారు. మరోసారి ఇలా జరుగకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు.