AlluSirish-Nayanika: మార్చి 2న అల్లు స్టూడియోస్‌లో ప్రీ-వెడ్డింగ్.. స్పెషల్ డేను ఫిక్స్ చేసుకున్న శిరీష్!

AlluSirish-Nayanika: మార్చి 2న అల్లు స్టూడియోస్‌లో ప్రీ-వెడ్డింగ్.. స్పెషల్ డేను ఫిక్స్ చేసుకున్న శిరీష్!

అల్లు వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ చిన్నకుమారుడు అల్లు శిరీష్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.   మరో వారం రోజుల్లో తన ప్రియురాలు నయనికతో కలిసి ఏడడుగులు వేయబోతున్నారు.ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తైయ్యాయి. ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సిద్ధమయ్యారు. లేటెస్ట్ గా అల్లు శిరీష్ సోషల్ మీడియాలో చేసిన తన పెళ్లి వేడుకల షెడ్యూల్  పోస్ట్ వైరల్ అవుతోంది. 

 అల్లు స్టూడియోస్‌లో ప్రీ-వెడ్డింగ్!

గతేడాది అక్టోబర్ 31న అత్యంత సన్నిహితుల మధ్య నయనికతో నిశ్చితార్థం చేసుకున్న శిరీష్, అప్పటి నుండే పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. ఇటీవల ఈ జంట తమ స్నేహితులతో కలిసి దుబాయ్‌లో గ్రాండ్‌గా 'బ్యాచిలర్ పార్టీ'ని జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.

లేటెస్ట్ గా తన పెళ్లి వేడుకల షెడ్యూల్‌ను అల్లు శిరీష్ స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. మార్చి 2న తెలుగు చిత్ర పరిశ్రమ సభ్యులందరి కోసం హైదరాబాద్‌లోని 'అల్లు స్టూడియోస్' వేదికగా ఘనంగా ప్రీ-వెడ్డింగ్ వేడుకలను నిర్వహించబోతున్నారు. "మా జీవితంలోని ఈ ముఖ్యమైన ఘట్టాన్ని చిత్ర పరిశ్రమ పెద్దలు, సహచరుల సమక్షంలో సెలబ్రేట్ చేసుకోవడం సంతోషంగా ఉంది" అని శిరీష్ ట్వీట్ చేశారు.

 

మార్చి 6న గ్రాండ్ వెడ్డింగ్

శిరీష్-నయనికల వివాహం మార్చి 6న జరగనుంది. ఇది కుటుంబ సభ్యులు, అత్యంత ఆత్మీయుల మధ్య ఈ పెళ్లి వేడుక నిర్వహిస్తున్నారు. తన అన్నావదినలైన అల్లు అర్జున్ స్నేహ రెడ్డిపెళ్లి రోజే శిరీష్ నయనిక వివాహం చేసుకోబోతుండటంతో ప్రత్యేకత సంతరించుకుంది. నిశ్చితార్థం సమయంలో శిరీష్ వైట్ ట్రెడిషనల్ అవుట్‌ఫిట్‌లో, నయనిక ఎరుపు రంగు డిజైనర్ డ్రెస్సులో మెరిసిపోయారు. ఇప్పుడు పెళ్లిలో ఈ జంట ఇంకెంత రాయల్‌గా కనిపిస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

మొత్తానికి, టాలీవుడ్ వరుస పెళ్లిళ్లతో కళకళలాడుతోంది. విజయ్-రష్మికల తర్వాత ఇప్పుడు అందరి కళ్లు శిరీష్-నయనికల పెళ్లిపైనే ఉన్నాయి. ఈ కొత్త జంట నూరేళ్లు చల్లగా ఉండాలని మెగాఅల్లు అభిమానులు సోషల్ మీడియా వేదికగా విష్ చేస్తున్నారు.