కోల్ కతా సిటీ వణికిపోయింది. భూ కంపం గట్టిగానే వచ్చింది. 2026, ఫిబ్రవరి 27వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట 22 నిమిషాల సమయంలో.. భూమి ఒక్కసారిగా కంపించింది. 5.5 తీవ్రతతో భూమి కంపించింది. భూమి గట్టిగానే కంపించటంతో.. జనం భయపడ్డారు. ఆఫీసులు, ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రోడ్లపైకి లక్షల మంది వచ్చేశారు. భూమి కంపించటం స్పష్టంగా తెలియటం.. తీవ్రత కూడా 5.5గా ఉండటంతో.. బెంబేలెత్తిపోయారు జనం. భూ కంపం తర్వాత.. ఇళ్లు, ఆఫీసుల్లోకి వెళ్లటానికి భయపడుతున్నారు జనం.
బంగ్లాదేశ్ కేంద్రంగా భూకంప కేంద్రం ఉన్నట్లు యూరోపియన్ మెడిటరేనియనల్ సీస్మోలాజికల్ సెంటర్ ప్రకటించింది. భూమికి 35 కిలోమీటర్ల లోతులో సంభవించిందని.. భూకంపం తీవ్రత కోల్ కతా సిటీపై ఎక్కువగా ఉందని స్పష్టం చేసింది EMSC సెంటర్. భూకంపం వచ్చినట్లు పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోల్ కతాలో భూ ప్రకంపనలు రావడం ఈ నెలలో ఇది రెండో సారి.
#Kolkata was just hit by a fairly strong #earthquakepic.twitter.com/9BDM6vF5sc
— ALKA MANDAL (@Alka_Mandall) February 27, 2026
ఫిబ్రవరి 3న రాత్రి భూప్రకంపనలతో ఇండ్లు, ఆఫీసులు ఊగిపోయాయి. ఏం జరుగుతుందో తెలియని ఆందోళనలు ప్రజలు బయటకు పరుగులు తీశారు. మయన్మార్ కేంద్రంగా 5.9 తీవ్రతతో వచ్చిన భూకంప ధాటికి వెస్ట్ బెంగాల్ తో పాటు బంగ్లాదేశ్ లోనూ భూమి కంపించింది. 10 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ జియో సైన్సెస్ పేర్కొంది.
Very strong #tremors in #Kolkata. #earthquake pic.twitter.com/moQb3I77xq
— Dhananjay Mandal (@dhananjaynews) February 27, 2026
