వైసీపీ నేత, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ అస్వస్థత గురయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయనకు బీపీ ఎక్కువ కావడం, నీరసంగా అనిపించడంతో ముందస్తుగా పరీక్షల కోసం హైదరాబాద్ వెళ్లారు.
గతంలో ఆయనకు మూడుసార్లు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన నేపధ్యంలో నిన్న అర్ధరాత్రి 2 గంటల సమయంలో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న సిటీ న్యూరో ఆసుపత్రిలో ఆయన చేరారు.
ALSO READ : అదృష్టం అంటే ఇలా ఉండాలి..
ఆయనకు మళ్ళీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తమని, ఇది కేవలం రెగ్యులర్ చెకప్ మాత్రమేనని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. బొత్స గారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని.. కంగారు పడాల్సిన అవసరం లేదని డాక్టర్లు, కుటుంబ సభ్యులు తెలిపారు.
