పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం మినిట్ టూ మినిట్ లైవ్ అప్డేట్స్

పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం మినిట్ టూ మినిట్ లైవ్ అప్డేట్స్

పాకిస్తాన్–ఆప్ఘనిస్తాన్ యుద్ధంలో ఇప్పటికి ఎంత మంది ప్రాణాలు కోల్పోయారంటే:

* పాక్ వైమానిక దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ సరిహద్దు దళాలపై దాడులు చేసిన ఆప్ఘన్ దళాలు

* ఇందుకు బదులుగా కాబూల్, కాందహార్లపై పాక్ బాంబు దాడి

* యుద్ధంలో ఇప్పటివరకూ ప్రాణాలు కోల్పోయిన 133 మంది ఆప్ఘన్ సైనికులు, 55 మంది పాక్ సైనికులు

ఆత్మాహుతి బాంబర్లను రంగంలోకి దింపుతున్న ఆప్ఘన్ తాలిబన్లు:

* ఆఫ్ఘన్ తాలిబన్లకు పాకిస్తాన్ సైన్యంతో పోల్చదగిన సైన్యం లేదు

* అందుకే అసాధారణ దాడి పద్ధతులను ఉపయోగించే ఆలోచనలో ఆప్ఘనిస్తాన్

* ఆఫ్ఘన్ తాలిబన్ల దగ్గర ఆత్మాహుతి బాంబర్లు, కామికేజ్ డ్రోన్లు

* పాక్ను ఎదుర్కొనేందుకు ఆత్మాహుతి బాంబర్లను పెద్ద సంఖ్యలో ఉపయోగించే అవకాశం

ఆప్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య అసలు గొడవేంటి..?:

* రెండు దేశాల మధ్య ముదిరిన ఉమ్మడి సరిహద్దు వివాదం

* కాబూల్, ఇతర ఆఫ్ఘన్ నగరాలపై వైమానిక దాడులు చేసిన పాకిస్తాన్

* రెండు దేశాలను వేరు చేసే డ్యూరాండ్ లైన్ వెంబడి పాకిస్తాన్ సైన్యంపై ఆఫ్ఘనిస్తాన్ దాడి

* ఇస్లామాబాద్ సహనం నశించిపోయిందని ప్రకటించిన పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్

* రెండు దేశాలు మధ్య "బహిరంగ యుద్ధం" మొదలైందని ప్రకటన

కుప్పకూలిన పాకిస్తాన్ స్టాక్ మార్కెట్:

* ఆఫ్గనిస్తాన్ దేశంతో యుద్ధం ప్రకటించిన మరు క్షణం కుప్పకూలిన పాకిస్తాన్ స్టాక్ మార్కెట్

* నష్టాల్లో ట్రేడ్ అవుతున్న షేర్లు.. భారీగా నష్టపోయిన ఆటోమొబైల్, సిమెంట్, ఎరువులు, బ్యాంకింగ్, ఆయిల్, గ్యాస్ షేర్లు

* MCB బ్యాంక్, మీజాన్ బ్యాంక్, నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ వంటి బలమైన షేర్లు కూడా నష్టాల్లో ట్రేడ్

* ఇప్పటికే లాభాల్లో ఉన్న పెట్టుబడిదారులు.. యుద్ధ భయంతో షేర్లు అమ్మేసిన పరిస్థితి

* ఈ క్రమంలోనే ఒత్తిడికి గురైన పాక్ స్టాక్ మార్కెట్

ఆప్ఘనిస్తాన్ సైన్యం–బలాబలాలివి:

* ఆప్ఘనిస్తాన్ ఆర్మీ సామర్థ్యం– లక్షా 72 వేలు

* ఈ సంఖ్యను 2 లక్షలకు పెంచాలని భావిస్తున్న తాలిబన్లు

* గత సైన్యం నుంచి పొందిన సోవియట్ యుద్ధ ట్యాంకులు, సాయుధ వాహనాలు

* కొన్ని ఫిక్స్డ్ వింగ్ విమానాలు, రెండు డజన్ల ఆర్మీ హెలికాఫ్టర్లు

* అణ్వాయుధాలు లేని స్థితిలో ఆప్ఘనిస్తాన్

* అయితే.. ఆప్ఘనిస్తాన్ ఏకైన బలం–గెరిల్లా యుద్ధ అనుభవం

* ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ నెట్ వర్క్ లేని స్థితిలో ఆప్ఘనిస్తాన్

* హ్యుమన్ నెట్ వర్క్, డ్రోన్లపై మాత్రమే ఆధారపడుతున్న ఆప్ఘనిస్తాన్ నిఘా వ్యవస్థ

పాకిస్తాన్ సైన్యం–బలాబలాలివి:

* 6 లక్షల 60 వేల మంది యాక్టివ్ మిలటరీ సిబ్బంది

* 5 లక్షల మంది రిజర్వు బలగాలు, 2 లక్షల 90 వేల మంది పారా మిలటరీ

* అల్ ఖలీద్, టీ–80 యుద్ద ట్యాంకులతో పాటు 6 వేల సాయుధ వాహనాలు

* F-16, JF-17 యుద్ధ విమానాలతో పాటు 465 యుద్ధ విమానాలు

* 250కి పైగా ఆర్మీ హెలికాఫ్టర్లు

* ఇంటిగ్రేటెడ్ రాడార్ నెట్ వర్క్

* 170 అణ్వాయుధాలు

* రక్షణ శాఖపై పాకిస్తాన్ పెడుతున్న ఖర్చు 10.2 బిలియన్ డాలర్లు

* పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంపై చైనా రియాక్షన్:

పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధ పరిస్థితులపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది. కాల్పుల విరమణకు ముందుకు రావాలని ఇరు దేశాలకు చైనా శుక్రవారం (ఫిబ్రవరి 27) పిలుపునిచ్చింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య వివాదం.. తదనంతర పరిణామాలను చైనా నిశితంగా గమనిస్తోందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ మీడియా సమావేశంలో తెలిపారు.

* పాక్, ఆప్ఘన్ యుద్ధం ఆపేందుకు మధ్యవర్తిత్వానికి రష్యా ముందడుగు:

పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ దేశాల మధ్య యుద్ధం పూర్తి స్థాయిలో మొదలైంది. రెండు దేశాల మధ్య యుద్ధం ఆపటానికి ఇప్పటికే కొన్ని దేశాలు ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే రష్యా జోక్యం చేసుకున్నది. పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ దేశాలు వెంటనే యుద్ధం ఆపటానికి మధ్యవర్తిత్వం వహిస్తామని స్పష్టం చేసింది రష్యా.

పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. తాలిబన్ల పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ దేశం పాకిస్తాన్ మిలటరీ క్యాంపులే టార్గెట్గా డ్రోన్లతో ఎయిర్ స్రైక్ చేసింది. పాకిస్తాన్ కూడా కాబూల్ తో పాటు మరో రెండు ఆప్ఘన్ ప్రావిన్స్లపై శుక్రవారం ఉదయం ఎయిర్ స్ర్టైక్స్ చేయడంతో అధికారికంగా ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది.

ఈ విషయాన్ని ఇస్లామాబాద్ డిఫెన్స్ మినిస్టర్ కూడా ధృవీకరించారు. ఆప్ఘనిస్తాన్పై ఓపెన్ వార్ ప్రకటించారు. ఫిబ్రవరి 26న రాత్రి సమయంలో పాకిస్తాన్ బోర్డర్ ట్రూప్స్పై ఆప్ఘనిస్తాన్ ఎయిర్ స్టైక్స్ చేయగా.. పాకిస్తాన్ ఇందుకు ప్రతీకారంగా ఫిబ్రవరి 27న ఆప్ఘనిస్తాన్లోని కాందహార్, కాబూల్, పాక్తియా ప్రాంతాలపై పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్కు దిగింది.