విజయ్-రష్మిక కలకాలం వర్ధిల్లాలి.. కొత్తజంటకు సినీ ప్రముఖుల విషెస్!

విజయ్-రష్మిక కలకాలం వర్ధిల్లాలి..  కొత్తజంటకు సినీ ప్రముఖుల విషెస్!

టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న ఎట్టకేలకు ఒకటయ్యారు. ఫిబ్రవరి 26, 2026న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా ఈ జంట ఏడడుగులు వేశారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ వివాహం భారతీయ చిత్ర పరిశ్రమలోనే ఈ ఏడాదికి అత్యంత వేడుకగా నిలిచిపోయింది. ఈ కొత్త జంటకు సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

పెళ్లి ఫోటోలను షేర్ చేసిన జంట..

పెళ్లి ముగిసిన వెంటనే ఈ జంట అధికారిక ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోగానే ఇంటర్నెట్ షేక్ అయిపోయింది. "నా బెస్ట్ ఫ్రెండ్‌ను.. నా భార్యగా మార్చేసుకున్నాను" అంటూ విజయ్ చేసిన పోస్ట్, "నిజమైన ప్రేమ అంటే ఏంటో నాకు నేర్పిన వ్యక్తి" అని రష్మిక పెట్టిన క్యాప్షన్లు నెటిజన్ల మనసు గెలుచుకున్నాయి.

 

శుభాకాంక్షల వెల్లువ
ఈ అందమైన జంటకు హృదయపూర్వక అభినందనలు. ప్రియమైన విజయ్, రష్మిక.. మీ ఇద్దరి జీవితం ఇకముందు మరింత అందంగా, ఆనందంగా సాగాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. అని నాని ట్వీట్ చేశారు. మ‌రోవైపు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు సమంత, కీర్తి సురేష్, కరణ్ జోహార్ వంటి ప్రముఖులు కూడా ఈ జంటను ఆశీర్వదించారు.

ALSO READ : ప్రధాని మోదీ, అమిత్ షాలను కలిసిన విజయ్ రష్మిక.. 

 

 "ఈ ఫ్రేమ్ నిండా ఎంతో ప్రేమ, ఆనందం కనిపిస్తున్నాయి. జీవితకాలం ఇలాగే ప్రేమతో ఉండాలి" అని ఆకాంక్షిస్తున్నాను  అంటూ కృతి సనన్ శుభాకాంక్షలు తెలిపారు.  "మీ కొత్త జీవితం హృదయపూర్వకంగా ఉంది. కలకాలం కలిసి ఉండాలి" అని  సందీప్ కిషన్,  సిద్ధు జొన్నలగడ్డ విషెస్ తెలిపారు.  "ఆరోగ్యం, సంపద, శాశ్వతమైన ఆనందం మీ సొంతం కావాలి" అంటూ హ్యాష్‌ట్యాగ్ #Virosh తో పోస్ట్ చేశారు సత్యదేవ్ , నిఖిల్ సిద్ధార్థ.వీరితో పాటు ఆయుష్మాన్ ఖురానా, భూమి పెడ్నేకర్, మౌనీ రాయ్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి వారు కూడా ఈ జంటకు అభినందలు తెలిపారు.

 

రెండు సంప్రదాయాల మేళవింపు

ఉదయ్‌పూర్‌లోని అతి విలాసవంతమైన 'మెమెంటోస్ బై ఐటీసీ హోటల్స్'లో విజయ్ రష్మిక పెళ్లి వేడుక జరిగింది. విజయ్ తెలుగు మూలాలను, రష్మిక కర్ణాటక (కొడగు) సంప్రదాయాలను గౌరవిస్తూ రెండు పద్ధతుల్లో వివాహాన్ని నిర్వహించారు.. ఉదయం తెలుగు హిందూ సంప్రదాయంలో, సాయంత్రం కొడవ పద్ధతిలో వేడుకలు జరిగాయి. ఎర్రటి బంగారు వర్ణం కలిగిన పట్టు వస్త్రాలు, సంప్రదాయ ఆభరణాలలో ఈ జంట మెరిసిపోతుంటే, అభిమానులు ముగ్ధులయ్యారు.

మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో విజయ్ రష్మిక వివాహ రిసెప్షన్ జరగనుంది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు తరలిరానున్నారు. 'రీల్ లైఫ్' జోడీ ఇప్పుడు 'రియల్ లైఫ్' దంపతులుగా మారడం చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.