అధికార దాహంతో బీజేపీ చేసిన రాజకీయ కుట్ర : కేజ్రీవాల్ భార్య

అధికార దాహంతో బీజేపీ చేసిన రాజకీయ కుట్ర : కేజ్రీవాల్ భార్య

ఢిల్లీ లిక్కర్ స్కాం అంటూ బీజేపీ చేసిన రాజకీయ కుట్ర ఇది.. ఆధారాలు లేకుండా స్కాం అంటూ అరెస్టులు చేశారంటూ వ్యాఖ్యానించారు ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్. బీజేపీ అధికార దాహానికి ఇది నిదర్శనం అని.. కోర్టులో నిజాయితీ నిరూపితం అయ్యిందంటూ స్పందించారామె.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ప్రత్యేక కోర్టు తీర్పు వెల్లడించిన తర్వాత మీడియాతో మాట్లాడారామె. కేజ్రీవాల్ నిర్ధోషి అని మాకు తెలుసు అని.. నిజం గెలుస్తుందని నమ్మేవాళ్లం అని.. ఈ రోజు రానే వచ్చిందన్నారామె. ఢిల్లీలో అధికారం కోసం బీజేపీ పార్టీ చేసిన రాజకీయ కుట్ర ఇది.. బీజేపీ అధికార దాహంతో పన్నిన కుట్ర ఇది అంటూ వ్యాఖ్యానించారామె. కేజ్రీవాల్, సిసోడియాను అన్యాయంగా జైలుకు పంపించారు.. వారి ధైర్యాన్ని దెబ్బతీయాలని చూశారు.. అయినా దేశం కోసం.. అభివృద్ధి కోసం వాళ్లు కట్టుబడి ఉన్నారనేది ఈ కేసులో తీర్పు తర్వాత స్పష్టం అయ్యిందన్నారామె.

అధర్మం ముందు గెలిచినా.. అంతిమంగా.. చివరకు సత్యం, ధర్మం.. న్యాయం మాత్రమే గెలుస్తుందని.. సత్యమేవ జయతే అన్నారామె. లిక్కర్ స్కాం లేదని.. లేని కుంభకోణాన్ని ఉన్నట్లు బీజేపీ చిత్రీకరించిందని.. వ్యవస్థలను అడ్డంపెట్టుకుని రాజకీయ కుట్ర చేసిందని.. ఇదే విషయాన్ని కోర్టు స్పష్టం చేసిందన్నారు సునీతా కేజ్రీవాల్. సత్యం వైపు దేవుడు నిలబడతాడనే నమ్మకం ఉందని.. అదే ఇప్పుడు జరిగిందన్నారు సునీత కేజ్రీవాల్.

ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని.. దానికి సమయం పడుతుందని.. ఇప్పుడు అదే జరిగిందన్నారామె. బీజేపీ అధికార దాహానికి.. రాజకీయ కుట్రలకు ఇది కేసు ఓ నిదర్శనం అని.. ఢిల్లీలో బీజేపీ పాలన ఎలా ఉందో ఇప్పటికే జనం చూస్తున్నారని.. అనుభవిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు సునీతా కేజ్రీవాల్.