గ్రేట్: అవయవ దాత తల్లికి అంత్యక్రియలు చేసిన వ్యక్తి

గ్రేట్: అవయవ దాత తల్లికి అంత్యక్రియలు చేసిన వ్యక్తి

మాతృత్వం, మానవత్వం రెండు కలిసి ఓ అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించాయి. కేరళలోని కోజికోడ్‌లో కన్న కొడుకు అవయవాల్ని తల్లి ఓ యువకుడికి దానం చేసింది. అవయవాలు అమర్చుకున్న వ్యక్తి తల్లికి కన్న కొడుకుగా మారాడు. విష్ణు ఓ రోడ్ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్‌గా డాక్టర్లు నిర్ధారించారు. క్యాన్సర్ తో బాధపడుతున్న అతని తల్లి జీవితం తెలుసుకొని విష్ణు అవయవాలు దానం చేయడానికి ముందుకు వచ్చింది. విష్ణు తల్లిదండ్రులు సుజన, షాజీ లు సోదరి నందనతో కలిసి ప్రభుత్వ మృత సంజీవని పథకం కింద విష్ణు గుండె, కాలేయం, కిడ్నీలు దానం చేశారు. 

విష్ణ గుండెను పతనంతిట్టకు చెందిన అశోక్ వి నాయర్ (44)కు అమర్చారు. ఈక్రమంలోనే అశోక్ ఓసారి సుజనను కలిశాడు. ఆమెను ఓదార్చాడు. అలా అశోక్ అప్పుడప్పుడు కొడుకు లేని లోటు తీర్చడానికి ఆమె దగ్గరకు వెళ్లి బాధను పంచుకునే వాడు. సుజన అశోక్ కు విష్ణు గురించి చెప్పేది. అలా వారి మధ్య తల్లికొడుకుల బంధం బలపడింది. అకస్మాత్తుగా క్యాన్సర్ ముదిరి సుజన చనిపోయింది. దీంతో అశోక్ సుజనకు తలకొరివి పెట్టి కొడుకుగా అంత్యక్రియలు చేశాడు.