ఇది మోదీ, అమిత్ షా కుట్ర.. సీబీఐ, ఈడీపై దేశ ప్రజలకు నమ్మకం పోయింది: కేజ్రీవాల్

ఇది మోదీ, అమిత్ షా కుట్ర.. సీబీఐ, ఈడీపై దేశ ప్రజలకు నమ్మకం పోయింది: కేజ్రీవాల్

ఆమ్ ఆద్మీ పార్టీ లేకుండా చేయాలని మోదీ, అమిత్ షా తమపై కుట్ర చేశారని అన్నారు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్. లిక్కర్ కేసులో క్లీన్ చిట్ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీని టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీబీఐ, ఈడీలను ఉపయోగించుకుని రాజకీయ లబ్ది పొందేందుకు ఆ ఇద్దరు కలిసి కుట్ర పన్నారని ఆరోపించారు. సీబీఐ, ఈడీపై దేశ ప్రజలకు నమ్మకం పోయిందన్న కేజ్రీవాల్.. భారత న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందన్నారు.

నేను నిజాయతీని సంపాదించా.. డబ్బులు కాదు.. కేజ్రీవాల్, సిసోడియా సహా ఆప్ నేతల నిజాయతీ రుజువైంది.. కేజ్రీవాల్ అత్యంత నిజాయతీ పరుడని తేలిపోయింది.. ఇక కేజ్రీవాల్ ను హత్య చేయడం తప్ప మోదీకి మరో అవకాశం లేదు.. లిక్కర్ కేసులో 600 పేజీల ఆర్డర్ లో.. ఈ కేసులో ఆధారాలు లేవని కోర్టు చెప్పింది.. అని అన్నారు. 

క్లీన్ చిట్ తర్వాత ఢిల్లీలో భారీ విజయోత్సవ ర్యాలీ చేపట్టారు కేజ్రీవాల్. అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. లిక్కర్ కేసు ద్వారా బీజేపీ లబ్ది పొందినట్లు ఆరోపించారు. మళ్లీ ఎలక్షన్లు పెట్టండి.. బీజేపీ10 సీట్లు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటూ సవాల్ విసిరారు.