టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నల వెడ్డింగ్ ముగిసింది. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా ఏడడుగులు వేసిన ఈ జోడీ, పెళ్లి తర్వాత మొదటిసారిగా బహిరంగంగా దర్శనమిచ్చారు. ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో సందడి చేసిన ఈ నూతన వధూవరుల ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.
పెళ్లి కళ!
పెళ్లికి ముందు వరకు తమ ప్రయాణాలను అత్యంత రహస్యంగా ఉంచిన ఈ జంట, ఇప్పుడు భార్యాభర్తలుగా ఒకరి చేయి మరొకరు పట్టుకుని గర్వంగా నడుచుకుంటూ వచ్చారు. ఎరుపు రంగు వైబ్రెంట్ చురీదార్ సెట్‌లో రష్మిక మందన్న అచ్చం 'కన్నడ కస్తూరి'లా మెరిసిపోతుండగా.. పౌడర్ బ్లూ కలర్ శాటిన్ కుర్తా-పైజామాలో విజయ్ దేవరకొండ ఎంతో హుందాగా కనిపించారు. ఎయిర్‌పోర్ట్ వద్ద వేచి ఉన్న ఫోటోగ్రాఫర్‌లను చూడగానే రష్మిక తనదైన శైలిలో చిరునవ్వు చిందిస్తూ, ఫ్లయింగ్ కిస్సులు ఇస్తూ సందడి చేశారు. విజయ్ కూడా చాలా కూల్‌గా కెమెరాలకు అభివాదం చేస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. గత ఎనిమిదేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట, పెళ్లి తర్వాత ఇలా జంటగా కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
#WATCH | Newlyweds Vijay Deverakonda and Rashmika Mandanna arrive at Udaipur airport, greet their fans pic.twitter.com/ZRJAFVUrYz
— ANI (@ANI) February 27, 2026
రెండు సంప్రదాయాలు.. ఒకే బంధం
ఉదయ్‌పూర్‌లోని విలాసవంతమైన 'ITC మెమెంటోస్' హోటల్‌లో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఈ పెళ్లిలో రెండు రాష్ట్రాల సంప్రదాయాలు ఉట్టిపడ్డాయి. విజయ్ దేవరకొండ మూలాలకు గౌరవమిస్తూ ఉదయం పూట హిందూ తెలుగు సంప్రదాయంలో వివాహం జరిగింది. రష్మిక పుట్టిన గడ్డ అయిన కూర్గ్ (కర్ణాటక) పద్ధతిలో సాయంత్రం వేళ కొడవ వివాహ వేడుకను నిర్వహించారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలోనే వీరి పెళ్లి జరిగింది. ఎనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 'రీల్ లైఫ్' నుంచి 'రియల్ లైఫ్' జంటగా మారి కొత్త ప్రయాణం మొదలు పెట్టారు.
ALSO READ : మార్చి 2న అల్లు స్టూడియోస్‌లో ప్రీ-వెడ్డింగ్..
హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్..
ఇప్పుడు అందరి కళ్లు మార్చి 4న జరగబోయే హైదరాబాద్ రిసెప్షన్ పైనే ఉన్నాయి. తాజ్ కృష్ణ వేదికగా జరగనున్న ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ దిగ్గజాలు కూడా హాజరుకానున్నారు. పెళ్లి కోసం రాజస్థాన్‌కు వెళ్లిన ఈ జంట, ఇప్పుడు హైదరాబాద్‌కు చేరుకుని రిసెప్షన్ పనుల్లో నిమగ్నం అవుతున్నారు. పెళ్లి ఫోటోలు ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతున్నాయి. మొత్తానికి, 'వీరోష్' (ViRosh) జంట తమ కొత్త జీవితాన్ని ఎంతో సంతోషంగా ప్రారంభించారు. ఈ క్రేజీ కపుల్ ఫోటోలు చూసిన నెటిజన్లు "మేడ్ ఫర్ ఈచ్ అదర్" అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు.
