ఫస్ట్ నైట్ రోజు వరుడికి షాకిచ్చిన వధువు.. గంటల్లోనే పెళ్లి పెటాకులు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా !

 ఫస్ట్ నైట్ రోజు వరుడికి షాకిచ్చిన వధువు.. గంటల్లోనే పెళ్లి పెటాకులు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా !

లక్షలు ఖర్చు పెట్టి చేసిన పెళ్లి గంటల వ్యవధిలోనే పెటాకులైపోయింది. ఫస్ట్ నైట్ రోజు.. సరిగ్గా రూమ్ లోకి ఎంటరయ్యాక పెళ్లి కూతురు ఇచ్చిన ట్విస్ట్ తో పెళ్లి కొడుకు షాక్ కు గురయ్యాడు. ఇరు కుటుంబాలు విడాకుల కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కటంతో ఆ నోటా ఈ నోటా విషయం బయటకు వచ్చింది. ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఈ వివాహ వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఉత్తరప్రదేశ్ లోని హమిర్పూర్ జిల్లాలో పెల్లి జరిగిన గంటల వ్యవధిలోనే కొత్త జంట విడాకులకు ఒప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. పెళ్లి కూతురు మిథిలేశ్ కుమారి పెళ్లి తంతు పూర్తయ్యాక అత్తగారింటికి వచ్చింది. సంప్రదాయం ప్రకారం ఫస్ట్ నైట్ కు ఏర్పాటు చేశారు. ఇద్దరూ రూమ్ లోకి వెళ్లాక.. తనతో ఉండలేనని భర్త ధరమ్ సింగ్ కుశ్వాహ కు చెప్పింది పెళ్లి కూతురు. 

బలవంతంగా పెళ్లి చేశారు:

తనకు  ఇష్టం లేకపోయినా  బలవంతంగా పెళ్లి చేశారని మిథిలేశ్ చెప్పింది. తను వేరే వ్యక్తితో ప్రేమలో ఉన్నానని చెప్పినా.. బలవంతంగా తిట్టి కొట్టి బెదిరించి పెళ్లి చేశారని భర్తతో చెప్పుకుంది. 

ఈ విషయం ముందే చెప్పి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని ధరమ్ సింగ్ కుశ్వాహా ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంత ఖర్చు, బంధువులలో పరువు పోయే పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. 

పెళ్లి కూతురు నిర్ణయంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ ముదిరి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. హమిర్పూర్ రాత్ స్టేషన్ లో ఇరు కుటుంబాల మధ్య సంధి చేసేందుకు పోలీసులు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. ఆ తర్వాత కొత్త జంటకు కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేయగా.. తన భర్తతో ఉండే ప్రసక్తే లేదని అమ్మాయి తేల్చి చెప్పింది. 

ఈ వివాదంపై రాత్ స్టేషన్ ఇన్-ఛార్జ్ రాకేశ్ సింగ్ మాట్లాడుతూ.. ఇరు కుటుంబాలతో మాట్లాడినప్పటికీ.. వాళ్లు విడిపోవటానికే నిశ్చయించుకున్నట్లు చెప్పారు. పరస్పర అంగీకారంతో ఇమ్మీడియేట్ డివోర్స్ (అత్యవసర విడాకులు) ను ఎంచుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత పెళ్లి కూతురు తన ఇంటికి వెళ్లిపోయినట్లు చెప్పారు.