SRH vs RR: 30వేల టికెట్స్ 5 నిమిషాల్లో సోల్డ్ ఔట్.. జోరుగా బ్లాక్ దందా.. ఫ్యాన్స్ ఫైర్

SRH vs RR: 30వేల టికెట్స్ 5 నిమిషాల్లో సోల్డ్ ఔట్..  జోరుగా బ్లాక్ దందా.. ఫ్యాన్స్ ఫైర్

ఐపీఎల్ టిక్కెట్లు దొరక్క ప్రతీసారి  ఫ్యాన్స్ కు నిరాశే ఎదురవుతోంది. SRH ఫ్రాంచైజీ.. పేటీఎం ఇన్ సైడర్ లో టిక్కెట్స్ అమ్ముతుండగా.. పెట్టిన 20 నిమిషాల్లోపే సోల్డ్ ఔట్ అవుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్ లకి ఇదే సీన్ రిపీట్ అయింది.  మే 2న ఉప్పల్ స్టేడియంలో జరగబోయే మ్యాచ్ కీ సేమ్ ఇదే సీన్ రిపీటైంది. 30వేల టిక్కెట్స్ ఐదు నిమిషాల్లో ఎలా అయిపోతాయంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  బ్లాక్ లో అమ్మేవాళ్లకి టికెట్స్ ఎలా దొరుకుతున్నాయంటున్న ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

పేటీఎం ఇన్ సైడర్, HCA ప్రతినిధులే బ్లాక్ లో టికెట్స్ అమ్మిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. టికెట్ల అమ్మకాల విషయంలో తమకు ఎలాంటి సంబంధం లేదని హెచ్ సీఏ తెలిపింది. ఐపీఎల్ టికెట్స్ పక్కదారి పడుతున్నాయంటూ అభిమానులు అందోళనకు దిగుతున్నారు. బ్లాక్ టికెట్స్ పై ఇప్పటవరకూ SRH ఫ్రాంచైజీ మేనేజ్మెంట్ స్పందించలేదు. 

కాగా, గతేడాదితో పోలిస్తే టిక్కెట్ రేట్స్ ఈసారి డబుల్ చేసింది SRH మేనేజ్మెంట్. మరోవైపు, ఐపీఎల్ టికెట్ల బ్లాక్ దందా జోరుగా సాగుతోంది. బ్లాక్ టికెట్స్ అమ్మేవాళ్లని పోలీసులు పట్టుకుంటున్నా..  బ్లాక్ దందా మాత్రం ఆగడంలేదు. ఒక్క టికెట్ ను బ్లాక్ లో డబుల్, త్రిపుల్ రేట్స్ కి అమ్ముతున్నారు.

గురువారం సాయంత్రం 7.30 గంటలకు సొంతగడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది.  వరుస విజయాలతో టాప్ గేర్ లో దూసుకుపోతున్న రాజస్థాన్ ను ఢీకొట్టడం హైదరాబాద్ కు సవాల్ వంటిదే. ఇప్పటివరకు 9 మ్యాచ్ లు ఆడిన ఎస్ఆర్ఎచ్ 5 మ్యాచ్ లు గెలిచి నాలుగింట్లో ఓడిపోయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతున్న హైదరాబాద్ కు ప్లేఆఫ్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్ లో గెలవాల్సిందే.