ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకొస్త : గడ్డం వంశీకృష్ణ

ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకొస్త : గడ్డం వంశీకృష్ణ

 తనను ఎంపీగా గెలిపిస్తే పెద్దపల్లి ప్రాంతానికి ప్రభుత్వ రంగ సం స్థలను తీసుకువచ్చే బాధ్యత తనదేనని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఇవాళ గోదావరిఖనిలో జరిగిన మే డే వేడుకల్లో ఎమ్మెల్యేలు వివేక్ వెంకట స్వామి, మక్కన్ సింగ్ రాజు ఠాకూర్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భం గా వంశీకృష్ణ మాట్లాడుతూ కంపెనీలు స్థాపించి పెద్దపల్లి ప్రాంత నిరుద్యోగులకు  ఉపాధి కల్పిస్తామన్నారు. కాకా బాటలోనే తాను కంపెనీని స్థాపించి 500 మందికి ఉద్యోగాలు ఇచ్చానని, అందులో సింగరేణి కార్మికుల బిడ్డలే ఎక్కువగా పని చేస్తున్నారన్నారు.

లేబర్ యూనియన్ స్థాపకుడు కాకా : వివేక్ వెంకటస్వామి

 బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉన్న ఉద్యోగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కార్మికుల భద్రత కోసం లేబర్ యూనియన్ను కాకా స్థాపిం చారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. కార్మికుల కోసం పెన్షన్ స్కీంను కాకా తీసుకువచ్చారన్నా రు. కార్మికుల కోసం జీవితాన్ని అంకితం చేశారన్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాడినప్పుడు పటాన్ చెరువులో తమ ఫ్యాక్టరీని మూసివేశారని ఆరోపించారు. సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు అమలు చేయిస్తామని హామీ ఇచ్చారు.  

మోదీ ఒక రాక్షసుడు : ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

పీఎం మోదీ ఒక రాక్షసుడని, బూటు కాలితో కార్మిక వర్గాన్ని తొక్కి పెడు తున్నాడని రామగుండ ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. కార్మిక చట్టాలను మార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీరా ముడి పేరు చెప్పి వస్తున్న రావణాసురుడు మోదీ అని సెటైర్ వేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే బ్రిటిష్ తరహా పాలన తెచ్చే ప్రమాదం ఉంద న్నారు. మోదీ కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. రామగుండం ను బొందల గడ్డగా చేసిన కేసీఆర్ ఏ ముఖం పెట్టుకొని రామగుండం కు వస్తున్నాడో ప్రజలు ప్రశ్నించాలన్నారు. చందాలు వేసుకొని గెలిచిన కొప్పుల ఈశ్వర్ నేడు డబ్బు ఎలా సంపాదించాడని ప్రశ్నించారు. ప్రతి ఒక్క కాంటాక్ట్ కార్మికుడికి లేబర్ కార్డును ఇప్పిస్తామన్నారు.