నివిన్ పౌలీ, శ్రుతి రామచంద్రన్, రజిత్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించిన వెబ్ సిరీస్ 'ఫార్మా'. డిసెంబరు 19 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతూ దూసుకెళ్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. పీఏ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లోని సన్నివేశాలకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఓ ఫార్మా కంపెనీ, అందులో తయారయ్యే ప్రాణాంతక మెడిసిన్.. అది అమ్మే మాములు మెడికల్ రిప్రెజెంటివ్ మధ్య సాగే పోరాటమే ఈ వెబ్ సిరీస్ 'ఫార్మా.
ఓ ఫార్మా కంపెనీలో కేపీ వినోద్(నివిన్ పౌలీ), మెడికల్ రిప్రెజెంటివ్‌గా చేరతాడు'కైడోక్సిన్' అనే మెడిసన్ సేల్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటాడు. అయితే ఈ మందు ఎంత ప్రమాదం అనే విషయాన్ని తెలుసుకుంటాడు. దీంతో వినోద్.. అతడి సంస్థపై తిరగబడతాడు? ఈ మధ్య సాగే సన్నివేశాలు ఉత్కంఠగా ఉంటాయి.
ఫార్మా కంపెనీ నుంచి వచ్చే ప్రమాదకరమైన మందులు.. ప్రజల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయన్నది ఆలోచింపజేసేవిగా దర్శకుడు చూపించారు. పిల్లల విషయంలో తన పరిశోధన గురించి డాక్టర్ జానకి చెప్పిన క్షణం నుంచి వినోద్ పాత్ర పూర్తిగా మారిపోతుంది. ఆ నేరానికి సంబంధించి బ్యాక్‌గ్రౌండ్‌లో వినోద్ చేసే ఇన్వెస్టిగేషన్ ఉత్కంఠరేపుతోంది. నివిన్‌పౌలీ మెడికల్ రిప్రజెంటేటివ్‌గా తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. ఓవైపు నవ్విస్తూనే మరోవైపు ఎమోషనల్ అయ్యేలా చేశారు.
8 ఎపిసోడ్లలో సిరీస్ రూపొందింది. కొన్ని ఎపిసోడ్లు దాదాపు 28 నిమిషాలు కాగా మరికొన్నింటి రన్‌టైమ్ సుమారు 20 నిమిషాలు. ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన చిత్రంగా 'ఫార్మా' నిలిచింది.
Pharma is getting outstanding reviews. Streaming exclusively on JioHotstar.#Pharma #JioHotstar #PharmaWebseries #JioHotstarMalayalam #Webseries #Drama #SocialDrama #SocialThriller #MedicalThriller #ItsJustBusiness #NowStreaming pic.twitter.com/uzaydGYAnY
— JioHotstar Malayalam (@JioHotstarMal) December 20, 2025
కథేంటంటే:
కేపీ వినోద్ (నివిన్ పౌలీ)ది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మెడికల్ రిప్రజెంటేటివ్‌గా ఉద్యోగంలో చేరుతాడు. మొదట్లో టార్గెట్స్, డాక్టర్స్‌తో డీలింగ్స్, మేనేజర్ (బిను పప్పు) పెట్టే ప్రెజర్‌తో బాగా స్ట్రగుల్ అవుతాడు. కానీ.. ఒకవైపు అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి, మరోవైపు కుటుంబ బాధ్యతలు ఉండడంతో కష్టపడి పనిచేస్తాడు. అలా చివరకు ప్రమోషన్ తెచ్చుకుని మేనేజర్ అవుతాడు.
అయితే.. అతనికి ఒక కొత్త మందు కైడోక్సిన్‌ని ప్రమోట్ చేయాలని టార్గెట్ ఇస్తారు. వినోద్ దాని సేల్స్‌ని విపరీతంగా పెంచుతాడు. అప్పుడే ఒక డాక్టర్ ద్వారా కైడోక్సిన్ వల్ల రోగులకు తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని తెలుసుకుంటాడు. ముఖ్యంగా పిల్లలు, గర్భిణీలు బాగా ఎఫెక్ట్ అవుతున్నారని గ్రహిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ మందు సేల్స్‌ని ఆపడానికి వినోద్ ఏం చేశాడు? అనేది మిగతా కథ.
