Devagudi: పాజిటివ్ రివ్యూస్‌తో దూసుకెళ్తున్న ‘దేవగుడి’.. కుల వ్యవస్థపై ఫోకస్.. కథేంటంటే?

Devagudi: పాజిటివ్ రివ్యూస్‌తో దూసుకెళ్తున్న ‘దేవగుడి’.. కుల వ్యవస్థపై ఫోకస్.. కథేంటంటే?

అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ ప్రధాన పాత్రల్లో బెల్లం రామకృష్ణా రెడ్డి దర్శక నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘దేవగుడి’. జనవరి 30న విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌గా రన్ అవుతోందని దర్శక నిర్మాత రామకృష్ణారెడ్డి అన్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడుతూ ‘మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఎక్కడా ల్యాగ్ లేకుండా గ్రిప్పింగ్ స్క్రీన్‌‌‌‌‌‌‌‌ప్లేతో ఉందని  ప్రశంసలు వస్తున్నాయి.  ప్రొడక్షన్ వ్యాల్యూస్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. యాక్షన్ సీక్వెన్సులు, పాటల చిత్రీకరణ బాగుందనే అప్రిషియేషన్స్ వస్తున్నాయి. రివ్యూస్ అన్నీ పాజిటివ్‌‌‌‌‌‌‌‌గా వచ్చాయి.

రఘు కుంచె చేసిన వీరారెడ్డి పాత్ర హైలైట్ అయ్యింది. అలాగే కీ రోల్స్ చేసిన అభినవ శౌర్య నరసింహ, అనుశ్రీ నటనను కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. కొందరు ఆడియెన్స్ సినిమా చూసి బయటకు వస్తూ భావోద్వేగానికి గురవుతున్నారు’ అని చెప్పారు. టీమ్ అంతా పాల్గొన్నారు.

కథేంటంటే:

రాయలసీమలోని ‘దేవగుడి’ అనే ఒక గ్రామం. ఆ ఊరిలో వీరారెడ్డి (రఘు కుంచె) అనే ఒక ఫ్యాక్షన్ లీడర్. అతనికి నాయకత్వం మీద ఎంత పట్టు ఉంటుందో.. కులపిచ్చి కూడా అంతేస్థాయిలో ఉంటుంది. తన ప్రాణాలను కాపాడే అనుచరులని కూడా కుల పిచ్చితోనే చూడటం అతని స్వభావం.

అలాంటి వీరారెడ్డి, తన అనుచరులలో ఒకరి కొడుకు ధర్మ (అభినవ్ శౌర్య). అతను వీరారెడ్డి కుమారుడితో (నరసింహ)తో ఫ్రెండ్ షిప్ చేస్తాడు. అదే సమయంలో వీరారెడ్డి కూతురు శ్వేత (అనుశ్రీ)ని లవ్ చేస్తాడు. ఇదంతా పసిగట్టిన వీరారెడ్డి, ఒక కారణం సృష్టించి ధర్మను ఊరి నుంచి గెంటేస్తాడు. 

ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు వీరారెడ్డి జీవితాన్ని పూర్తిగా మలుపుతిప్పుతాయి. ఒకవైపు వరుసగా అతని అనుచరులు హత్యకు గురవుతుంటే, మరోవైపు శ్వేత అకస్మాత్తుగా మాయమవుతుంది. అసలు శ్వేత ఎలా మిస్సైంది? ధర్మ-వీరారెడ్డి మధ్య ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకున్నాయి? చివరికి శ్వేత – ధర్మల ప్రేమకథకు ఎలాంటి ముగింపు దక్కింది? అన్నదే మిగతా కథ.