Psych Siddhartha OTT: ఓటీటీలోకి తెలుగు బోల్డ్ రొమాంటిక్ మూవీ ‘సైక్ సిద్ధార్థ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Psych Siddhartha OTT: ఓటీటీలోకి తెలుగు బోల్డ్ రొమాంటిక్ మూవీ ‘సైక్ సిద్ధార్థ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

సింగర్ గీతా మాధురి భర్త, నందు హీరోగా నటిస్తూ శ్యామ్ సుందర్ రెడ్డితో కలిసి నిర్మించిన చిత్రం ‘సైక్ సిద్ధార్థ’. వరుణ్ రెడ్డి దర్శకుడు. యామిని భాస్కర్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటించింది. ప్రియాంక రెబెకా శ్రీనివాస్ కీలక రోల్ ప్లే చేసింది.

రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా, సురేష్​ ప్రొడక్షన్స్ ద్వారా జనవరి 1న థియేటర్స్‌‌‌‌‌‌‌‌లో విడుదలైన ఈ సినిమా మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడీ మూవీ ఆహా వీడియో ఓటీటీలోకి ఇవాళ (ఫిబ్రవరి 3) వచ్చేసింది. అయితే, ఫిబ్రవరి 4 స్ట్రీమింగ్ కావాల్సిన ఈ మూవీ, ఒక రోజు ముందు నుంచే అందుబాటులోకి వచ్చింది. కానీ ఈ స్పెషల్ స్ట్రీమింగ్ ఆహా గోల్డ్ సబ్ స్క్రైబర్లకు మాత్రమే అని సదరు ఓటీటీ సంస్థ తెలిపింది. 

ఇప్పటివరకూ ఎక్కువ క్లాస్ రోల్స్లో కనిపించిన నందు.. ఈసారి కాస్త ట్రాక్ మార్చాడు. యూత్ని టార్గెట్ చేసుకొని బోల్డ్ కంటెంట్తో మెప్పించడానికి వచ్చాడు. అయినప్పటికీ, రిజల్ట్ కాస్తా తేడా కొట్టేసింది. ఇందులో హీరో నందు హైపర్ యాక్టివ్‌‌‌‌గా కనిపిస్తూ ప్రతి చిన్న విషయానికి ఓవర్‌‌‌‌‌‌‌‌గా రియాక్ట్‌‌‌‌ అవుతుంటాడు. మోసపోయిన ఓ యువకుడి క్యారెక్టర్ ఎలా ఉంటుందనేది ఇందులో ఎక్స్ ట్రీమ్ గా చూపించారు.

‘సైక్ సిద్ధార్థ’ కథ:

హైదరాబాద్‌కి చెందిన యువకుడు సిద్ధార్థ (శ్రీ నందు), పబ్‌లో పరిచయం అయిన త్రిష (ప్రియాంక రెబెకా శ్రీనివాస్) అనే అమ్మాయితో రిలేషన్‌షిప్‌ పెట్టుకుంటాడు. ఆమె కోసం ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ పెట్టాలనుకుంటాడు. ఇందులో రూ.2 కోట్ల ఇన్వెస్ట్ మెంట్ పూర్తిగా సిద్ధార్థనే పెడతాడు. బిజినెస్‌ పార్ట్నర్స్‌గా మన్సూర్ (సుఖేష్‌ రెడ్డి)తో పాటు ప్రియురాలు త్రిష కూడా ఉంటారు.

చివరకు మన్సూర్‌, త్రిష కలిసి సిద్ధార్థను మోసం చేస్తారు. వాళ్లిద్దరూ రిలేషన్‌షిప్‌లో పడి సిద్ధార్థను కంపెనీ నుంచి బయటకు గెంటేస్తారు. కోట్లు కోల్పోయిన సిద్ధార్థ ఓ బస్తీలో చిన్న ఇంట్లోకి అద్దెకు దిగుతాడు సిద్ధార్థ. అదే బిల్డింగులోకి భర్త చేతిలో చిత్ర హింసలు అనుభవిస్తున్న శ్రావ్య (యామిని భాస్కర్‌) కూడా రెంట్‌కి దిగుతుంది? ప్రేమలో ఎదురైన మోసం, జీవితంలో ఎదురైన పతనం తర్వాత శ్రావ్య పరిచయం అతని జీవితాన్ని ఎలా మార్చింది? అన్నదే కథ