బాలీవుడ్ టాలెంటెడ్ నటి భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలో నటించిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘దల్దల్’. విష్ ధమీజా రాసిన 'భిండీ బజార్' నవల ఆధారంగా ఈ సిరీస్ రూపొందింది. ముంబైలో జరిగే వరుస దారుణ హత్యలను దర్యాప్తు చేసే డిసిపి రీటా ఫెరీరా (భూమి) ప్రయాణమే ఈ కథ. జనవరి 30 నుండి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్, ఆడియన్స్ని అలరిస్తుంది.
తన వ్యక్తిగత గాయాలు, వ్యవస్థలోని అవినీతితో పోరాడుతూ హంతకుడిని ఎలా పట్టుకుందనేది ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ఇందులో భూమి పెడ్నేకర్తో పాటుగా సమర తిజోరి, ఆదిత్య రావల్, చిన్మయ్ మాండ్లేకర్, గీతా అగర్వాల్ శర్మ, సందేశ్ కులకర్ణి, అనంత్ మహదేవన్, విభావరి దేశ్‌పాండే, ప్రతీక్ పచౌరి, రాహుల్ భట్ కీలక పాత్రల్లో నటించారు.
Yeh Daldal mein toh phass gaye, kya Daldal dekh paoge ‼️#DaldalOnPrime, New Series, Watch Now https://t.co/8aobla2hiu@bhumipednekar @sureshtriveni78 @vikramix @amritrajguptaa @SamaraTijori #AdityaRawal @Abundantia_Ent @priyawriter #SreekanthAgneesawaran #RohanDsouza… pic.twitter.com/a9SNoEIgNq
— prime video IN (@PrimeVideoIN) January 29, 2026
కథేంటంటే:
రీటా ఫెర్రీరా (భూమిపెడ్నేకర్) ముంబై క్రైమ్ బ్రాంచ్‌లో పనిచేస్తుంటుంది. పిల్లల అక్రమ రవాణాకు సంబంధించిన ఒక కేసును పరిష్కరించి చిన్న వయసులోనే డీసీపీగా ప్రమోషన్ పొందుతుంది. చిన్నప్పుడు తన తల్లి ఇసాబెల్ (విభావరి దేశ్‌పాండే) వల్ల ఎదుర్కొన్న కొన్ని ఇబ్బందుల వల్ల ఆమె చాలా బాధపడుతుంది. అది ఆమెని పెద్దయ్యాక కూడా వేధిస్తూనే ఉంటుంది. దాంతో ఆమె వ్యసనాలకు బానిసవుతుంది.
అయితే.. అదే టైంలో వర్క్‌ప్లేస్‌లో సీనియర్లు ఆమెను ఎదగనీయకుండా చేస్తుంటారు. అప్పుడే ఆమె ఒక సీరియల్ కిల్లర్ కేసును ఛేదించాల్సి వస్తుంది. హంతకుడు బాధితుల మణికట్టు కోసి చంపుతుంటాడు. ఆ కిల్లర్ ఎవరు? అతన్ని కనిపెట్టేందుకు రీటా ఏం చేసింది? అనేదే మిగతా స్టోరీ.
ఎలా ఉందంటే:
ఈ సిరీస్‌లో భూమి పెడ్నేకర్ సమర్థవంతమైన పోలీస్ అధికారిగా కనిపించింది. ఆమె పని చేసే పరిధిలో వరుస హత్యలు జరుగుతుంటాయి. అవి కూడా అత్యంత వింతగా, భయానకంగా. అసలు ఈ హత్యల వెనక ఉన్నది ఎవరు? వాటికి కారణం ఏమిటి? అలాగే చిన్నతనంలో భూమి ఎదుర్కొన్న చేదు అనుభవాలు ఆమెపై ఎలాంటి ప్రభావం చూపించాయి? అనే కోణాల్లో సాగే కథనం ఆసక్తికరంగా ఉంటుంది.
►ALSO READ | VijayRashmika: విజయ్-రష్మికపెళ్లి.. సోషల్ మీడియాలో రచ్చ.. మ్యారేజ్ ఫిబ్రవరి 2 కాదు, డేట్ ఇదే..!
సీరియల్ కిల్లర్‌ను పట్టుకునే క్రమంలో వచ్చే ఊహించని ట్విస్టులు, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను చివరి ఎపిసోడ్ వరకు కట్టిపడేస్తాయి. ముఖ్యంగా భూమి పెడ్నేకర్ నటన, ఆమె పాత్రలోని మానసిక సంఘర్షణ చాలా సహజంగా చూపించారు.
అమృత్ రాజ్ గుప్తా డైరెక్ట్ చేసిన ఈ సిరీస్‌లో ముంబై నగర నేపథ్యం, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు ఎంతో వాస్తవికంగా తెరకెక్కించారు. ఒక్కో ఎపిసోడ్ అరగంటకు పైగా నిడివితో మొత్తం 7 ఎపిసోడ్‌లు ఉండగా, ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ జానర్‌ను ఇష్టపడే వారికి ‘దల్దల్’ తప్పకుండా నచ్చే వెబ్‌సిరీస్. బలమైన కథనం, చక్కటి నటన, ఉత్కంఠభరిత మలుపులతో ఈ సిరీస్ ప్రేక్షకులను పూర్తిగా ఎంగేజ్ చేస్తుంది.
