VijayRashmika: విజయ్-రష్మికపెళ్లి.. సోషల్ మీడియాలో రచ్చ.. మ్యారేజ్ ఫిబ్రవరి 2 కాదు, డేట్ ఇదే..!

VijayRashmika: విజయ్-రష్మికపెళ్లి.. సోషల్ మీడియాలో రచ్చ.. మ్యారేజ్ ఫిబ్రవరి 2 కాదు, డేట్ ఇదే..!

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండల ప్రేమాయణం ఎంత హాట్ టాపిక్‌గా నిలిచిందో, ఇప్పుడు వీరి పెళ్లి వార్తలు కూడా అంతే వేగంగా వైరల్ అవుతున్నాయి. లేటెస్ట్గా సోషల్ మీడియాలో విజయ్-రష్మికల పెళ్లి ఇవాళ (2026 ఫిబ్రవరి 2న) జరుగుతున్నట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా వైరల్ అవుతోంది.

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోనున్నట్లుగా వేదికకు సంబంధించిన వీడియోలు ఆన్‌లైన్‌లో కనిపించడంతో, ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్‌కు సంబంధించినవని రూమర్స్ వ్యాపించాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని సినీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఫిబ్రవరి 2న పెళ్లి జరగడం లేదని, ప్రచారంలో ఉన్న సమాచారం పూర్తిగా అవాస్తవమని తేల్చి చెబుతున్నారు.

వెడ్డింగ్ డేట్లో మార్పు:

విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న వివాహానికి సంబంధించి ఇప్పటికే అనేక తేదీలు ప్రచారంలోకి వచ్చాయి. మొదట ఫిబ్రవరి 26న వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 2 అని వైరల్ అయింది. కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఆ ఫిబ్రవరి 26 తేదీని ఫిబ్రవరి 5కి మార్చినట్లుగా సినీ వర్గాల సమాచారం.

పలు బాలీవుడ్ నివేదికల ప్రకారం, అయితే, ఇవాళ ఫిబ్రవరి 2 నుంచే ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమవుతాయని సమాచారం. ముందుగా సంగీత్, హల్ది మరియు మెహందీని ప్లాన్ చేసుకుంటున్నారని టాక్. ఆ తర్వాత, వివాహం మరియు చిన్న రిసెప్షన్ కూడా ఉంటుందని తెలుస్తోంది. 

►ALSO READ | Theater Movies: ఫిబ్రవరి ఫస్ట్ వీక్ స్పెషల్.. చిన్న సినిమాలతో థియేటర్లలో కొత్త జోష్

మొదట వినిపించిన ఫిబ్రవరి 26 కాకుండా ఇప్పుడు ఫిబ్రవరి 5ని విజయ్-రష్మిక ఎంచుకోవాలని కుటుంబ జ్యోతిష్కులు కోరినట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే  ఫిబ్రవరి 5కి ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే, ఈ వివాహ వేడుక పూర్తిగా ప్రైవేట్‌గా, కుటుంబ సభ్యులు-సన్నిహితులకే పరిమితంగా జరగనుందని సమాచారం.

ఇదిలా ఉండగా, బెంగళూరుకు చెందిన పూల వ్యాపారులు ఈ వారంలో రాజస్థాన్‌కు పెద్ద మొత్తంలో ఆర్డర్‌లను పంపుతున్నారని టాక్. ఈ లేటెస్ట్ అప్డేట్ వీరి పెళ్లి చర్చకు మరింత ఆజ్యం పోసింది...

అధికారిక ప్రకటనే కీలకం!

ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం మొత్తం ఊహాగానాలే అని సినీ వర్గాలు చెబుతున్నాయి. విజయ్ లేదా రష్మిక తరఫున అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ వార్తలను పూర్తిగా నమ్మలేమని కూడా అంటున్నారు. ఏది ఏమైనా, ఈ స్టార్ జంట పెళ్లి ఎప్పుడన్నది అధికారికంగా తేలేవరకు రూమర్లు మాత్రం ఆగేలా లేవని చెప్పాలి.