సంక్రాంతి పండుగ ముగిసి దాదాపు 15 రోజులు అవుతున్నప్పటికీ, ఇప్పటివరకు థియేటర్లలో కొత్త సినిమాల సందడి పెద్దగా కనిపించలేదు. ఆ మధ్యలో హిందీ మూవీ బార్డర్ 2 వచ్చినప్పటికీ, అది తెలుగు సినిమా కాదు. ఈ క్రమంలోనే సినీ ఆడియన్స్ పూర్తిగా ఓటీటీ సినిమాల వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే, ఫిబ్రవరి నెల స్టార్ట్ అవుతూనే కొత్త సినిమాల రాక మొదలైంది. ఒకటి కాదు, రెండు కాదు-ఏకంగా 8 కొత్త తెలుగు సినిమాలు ఒకేసారి థియేటర్లలో సందడి చేయడానికి వస్తున్నాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఫిబ్రవరి ఫస్ట్ వీక్ మొత్తం చిన్న సినిమాలదే హవా. ఇందులో సైకలాజికల్ హార్రర్ థ్రిల్లర్, లవ్ స్టోరీస్, ఫ్యామిలీ డ్రామా, సోషల్ మెసేజ్ సినిమాలు ఉన్నాయి. మరి ఆ సినిమాల ఏంటనేది ఓ లుక్కేద్దాం..
‘యుఫోరియా’:
తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడు గుణశేఖర్ అంటేనే మనకు భారీ సెట్టింగ్‌లు, పౌరాణిక గాథలు గుర్తుకు వస్తాయి. కానీ ఈసారి ఆయన తన పంథాను పూర్తిగా మార్చుకున్నారు. ఒక సున్నితమైన , అత్యంత భయంకరమైన సామాజిక ఇతివృత్తంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నేటి సమాజంలోని అత్యంత భయంకరమైన ‘డ్రగ్స్’ సంస్కృతిని ఇతివృత్తంగా తీసుకుని చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అదే ‘యుఫోరియా’ మూవీ. భూమిక ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో కొట్టం నటులు సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేశ్ గవిరెడ్డి కీలక పాత్రలు పోషించారు.
ఈ కథ ‘సివిల్ సర్వెంట్’ కావాలని కలలు కనే ఒక సామాన్య యువతి (సారా అర్జున్) చుట్టూ తిరుగుతుంది. డ్రగ్స్ మత్తులో తూగుతున్న ఒక యువకుడు ఆమెపై జరిపిన అఘాయిత్యం, ఆ అమ్మాయి ఆశయాలను చిన్నాభిన్నం చేస్తుంది. ఈ చిత్రంలో సీనియర్ నటి భూమిక పోషించిన పాత్ర అత్యంత ప్రాధాన్యత కలిగినది. నిందితుడైన యువకుడి తల్లిగా ఆమె నటించారు. సాధారణంగా కన్న కొడుకు తప్పు చేస్తే కప్పిపుచ్చే తల్లులను మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ భూమిక తన కొడుకు చేసిన నేరాన్ని భరించలేక, బాధితురాలికి న్యాయం చేయాలని స్వయంగా హైకోర్టును ఆశ్రయిస్తుంది. "ఆమె చేసిన నేరం ఏంటి?" అనే ప్రశ్న ప్రేక్షకుల్లో ఉత్సుకతను రేకెత్తిస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. గుణ శేఖర్ కి హిట్ పడుతుందో లేదో చూడాలి!
‘హనీ’:
టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ నవీన్ చంద్ర నటిస్తున్న లేటెస్ట్ సైకలాజికల్ హారర్ మూవీ ‘హనీ’ (HONEY). కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సమాజంలోని చీకటి కోణాలను, మూఢనమ్మకాలు మరియు అంధ విశ్వాసాల వెనుక దాగి ఉన్న భయానక నిజాలను ఆవిష్కరించబోతోంది. ఇటీవల విడుదలైన ‘హనీ’ గ్లింప్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. సమాజంలో వేళ్లూనుకున్న మూఢనమ్మకాలు, డార్క్ సైకలాజికల్ ఎలిమెంట్స్ చుట్టూ కథ సాగుతుందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. నవీన్ చంద్ర హారర్ టోన్‌కు ఆడియన్స్ భయపడటం కన్ఫామ్ అని టాక్.
‘శ్రీ చిదంబరం గారు’:
నటుడు వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ఠ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘శ్రీ చిదంబరం గారు’ . ఈ మూవీ వినయ్‌రత్నం దర్శకత్వంలో రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమా, కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా మనసుని హత్తుకునే భావోద్వేగాలను పండించే 'ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా'గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారీ అంచనాలతో చింతా వినీషారెడ్డి, చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
‘సుమతీ శతకం’:
బిగ్‌బాస్ ఫేమ్ అమర్‌దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా ఎంఎం నాయుడు దర్శకత్వంలో సుధాకర్ కొమ్మాలపాటి నిర్మిస్తున్న చిత్రం ‘సుమతీ శతకం’.యూత్‌ఫుల్, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రానుంది. ఫిబ్రవరి 6న మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ ద్వారా సినిమా విడుదల కానుంది.
‘లగ్గం టైం’:
రాజేష్ మేరు, నవ్య చిట్యాల జంటగా ప్రజోత్ కె వెన్నం దర్శకత్వంలో కె హిమబిందు నిర్మించిన చిత్రం ‘లగ్గం టైం’. ఫిబ్రవరి 6న సినిమా రిలీజ్ కానుంది.
'విత్ లవ్:
గతంలో 'టూరిస్ట్ ఫ్యామిలీ' వంటి విభిన్నమైన చిత్రంతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అభిషన్ జీవింత్... ఇప్పుడు వెండితెరపై హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ 'విత్ లవ్'. ఈ సినిమాలో 'ఛాంపియన్' ఫేమ్, కేరళ కుట్టి అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తుంది. మదన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సౌందర్య రజినీకాంత్, మాగేశ్ రాజ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
కాలేజీ నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కింది. "ప్రేమ అనేది ఒక అనుభూతి మాత్రమే కాదు, అదొక ప్రయాణం" అనే పాయింట్‌ను దర్శకుడు చాలా హృద్యంగా చూపించినట్లుగా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. కాలేజీ రోజుల్లోని తీపి జ్ఞాపకాలను, మొదటి ప్రేమలోని మధురానుభూతులను మళ్ళీ వెండితెరపై గుర్తు చేయబోతుంది ఈ 'విత్ లవ్'. ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. సౌందర్య రజినీకాంత్ నిర్మాణ భాగస్వామి కావడంతో ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
ఇకపోతే, ఈ సినిమాలతో పాటుగా ‘ఆపరేషన్ పద్మ’, హిందీ మూవీ వద్ 2 ఉన్నాయి. మరి ఈ కొత్త సినిమాలతో ఆడియన్స్కు ఫుల్ ఎంటర్ తినే అవ్వడం గ్యారెంటీ అనే చెప్పాలి. కొత్త సినిమాలు లేక డిస్సపాయింట్ అవుతున్న ఆడియన్స్కి, ఇవి కాస్తా ఉపశమనం అనే చెప్పాలి.
