హైదరాబాద్ లోని దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (DICCI) అంబేడ్కర్ రిసోర్స్ సెంటర్ లో ఏసీపీ విష్ణుమూర్తి సంతాప సభలో పాల్గొని నివాళులు అర్పించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అందరూ విష్ణుమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ఆదివారం (డిసెంబర్ 21) జరిగిన సంతాప సభలో విష్ణుమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మంత్రి వివేక్.
గతకొన్ని రోజుల క్రితం గుండె పోటుతో మృతి చెందిన ఏసీపీ విష్ణుమూర్తి సంతాప సభను లతారాజా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రజాసంఘాలు, రాజకీయ నాయకులు, దళితులు, బుద్ధిస్టులు మొదలైనవారు హాజరయ్యారు.
ఏసీపీ విష్ణుమూర్తి దళిత జాతి ప్రయోజనాల గురించి మాట్లాడేవాడని అన్నారు మంత్రి వేక్. ..రాష్ట్రంలో అట్రాసిటీ కేసు ఎక్కడ నమోదైనా.. తమతో మాట్లాడేవాడని తెలిపాడరు. ఎప్పుడూ భయపడే వారు కాదుధైర్యంగా ముందుకెళ్లేవాడని మంత్రి చెప్పారు.
