పెట్స్ కి సరైన తిండి పెట్టడమూ అంతే ముఖ్యం

పెట్స్ కి సరైన తిండి పెట్టడమూ అంతే ముఖ్యం

పెంపుడు జంతువులని ప్రేమగా చూసుకోవడం ఎంత ముఖ్యమో వాటికి సరైన తిండి పెట్టడం కూడా అంతే ముఖ్యం. అయితే  పెట్స్​కి రెడీమెడ్ ఫుడ్ కాకుండా కొంతమంది ఇంట్లో నూనెతో వండిన ఫుడ్ పెడుతుంటారు. దాంతో ఆ ఫుడ్​ అరగక అవి​ ఇబ్బంది పడతాయి. అంతేకాదు వాటికి ఎలర్జీలతో పాటు ఇతర జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకని ఫుడ్​ వండేటప్పుడు ఎలాంటి నూనె  వాడుతున్నారు అనేది చాలా ముఖ్యం అంటున్నారు వెటర్నరీ డాక్టర్​ దిలీప్​ సోనునే.  

  • పెట్స్​కోసం వండేటప్పుడు ఇంట్లో ఉపయోగించే నూనె వాడొద్దు. ముఖ్యంగా కొన్ని జాతులకు చెందిన పెంపుడు కుక్కలకు వాటికి సరిపడే ఫుడ్ మాత్రమే పెట్టాలి.  వాటికోసం ఒమెగా–3, ఒమెగా–6 లేదా ఒమెగా–9 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న నూనె వాడాలి.  
  • ఆలివ్​ ఆయిల్​తో వండిన ఫుడ్ తినిపిస్తే పెట్స్​ చర్మం హైడ్రేట్​గా ఉంటుంది. వాటి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఒమెగా–3, ఒమెగా–6 ఫ్యాటీ యాసిడ్స్​ని అరిగించుకోలేని పెట్స్​కి ఆలివ్​ ఆయిల్ బెస్ట్ ఆప్షన్.
  • ఫిష్​ ఆయిల్​లో ఇకొసపెంటనోయిక్​ యాసిడ్ (ఇపిఎ), డైహైడ్రాక్సీ అసిటోన్ ( డిహెచ్​ఎ) వంటి ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి పెట్స్​లో ఇన్​ఫ్లమేషన్ వల్ల వచ్చే ఎలర్జీలను తగ్గిస్తాయి. వాటికి చుండ్రు రాకుండా, చర్మం దురద పెట్టకుండా చేస్తాయి. అందుకని  పెట్స్​కి ఫిష్​ ఆయిల్ ట్యాబ్లెట్లు ఇవ్వాలి. అవి తినే ఫుడ్ మీద  కొంచెం ఫిష్​ ఆయిల్ చల్లినా సరిపోతుంది. 
  • పెట్స్​కు ఫుడ్ అరగకపోతే వంట కొబ్బరినూనెతో వండిన ఫుడ్ పెట్టాలి. దాంతో సమస్య తగ్గుతుంది. ఈ ఫుడ్​ తింటే వాటి నోటి నుంచి వచ్చే చెడు వాసన కూడా పోతుంది. అయితే ఆర్గానిక్​ లేదా గానుగ పట్టించిన కొబ్బరి నూనె వాడటం బెటర్.  
  • సన్​ఫ్లవర్ ఆయిల్​లో ఒమెగా–6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.  ఇవి పెట్స్​ చర్మాన్ని, గుండెని ఆరోగ్యంగా ఉంచుతాయి.