NTR 31: ఎన్టీఆర్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. తారక్ బర్త్ డేకి బద్దలయ్యే అప్డేట్?

NTR 31: ఎన్టీఆర్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. తారక్ బర్త్ డేకి బద్దలయ్యే అప్డేట్?

ఎన్టీఆర్ ఫ్యాన్స్(Ntr Fans) గెట్ రెడీ.. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అప్డేట్ త్వరలోనే రానుందని సమాచారం. మేకర్స్ ఆదిశగా ప్లాన్ చేస్తున్నారట. ఆ అప్డేట్ వస్తే మాత్రం ఇండస్ట్రీ షేక్ అవడం ఖాయం. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. జూనియర్ ఎన్టీఆర్ తో  కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఓ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు రెండు సంవత్సరాల క్రితమే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్. 

ఇక అప్పటినుండి ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కానీ, ఈ ప్రాజెక్టు గురించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు మేకర్స్. కారణం.. ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులు ఆలస్యం అవడమే. మరోపక్క దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ప్రభాస్ తో సలార్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. దీంతో ఎన్టీఆర్ 31 గురించి ఎవరు మాట్లాడటం లేదు. ఆ కారణంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. 

అయితే.. తాజా సమాచారం మేరకు ఎన్టీఆర్ 31 నుండి త్వరలోనే అదిరిపోయే అప్డేట్ రానుందట. అది కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండుగరోజైన ఆయన పుట్టినరోజున. అవును.. మే 20 ఎన్టీఆర్ పుట్టినరోజున ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయం తెలియడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి ఈ ప్రాజెక్టు నుండి ఇప్పటికే విడుదలైన ఒక పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేయగా.. ఇప్పుడు ఎలాంటి అప్డేట్ ఇస్తారా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.