ఎన్నికల తర్వాత కాంగ్రెస్లోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఎన్నికల తర్వాత కాంగ్రెస్లోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి సుమారు 20 మంది  ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందన్నారు మంత్రి ఉత్తమ్ కుమర్ రెడ్డి.  ఎన్నికలు అయిపోయిన తర్వాత రాష్ట్రంలో బిఆర్ఎస్ కనుమరుగైపోతుందన్నారు. గత ఎన్నికల్లో 109 సీట్లు వచ్చిన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో కేవలం 39 సీట్లకు మాత్రమే పరిమితమైంది..ఇప్పటికే నలుగురు కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్పారు.  

ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, బిజేపీలకు డిపాజిట్లు కూడా దక్కబోవన్నారు ఉత్తమ్.  పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్  ఒక్క సీటు కూడా గెలవదని చెప్పారు.  బీజేపీ  మతాల మధ్య చిచ్చు పెట్టి మతతత్వ రాజకీయాలు చేస్తుందని విమర్శించారు.  

బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసివేస్తారని.. కాంగ్రెస్ వస్తే  జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కలిపిస్తుందన్నారు.   రిజర్వేషన్లు పెంచడానికి ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంటులో చర్చించానని చెప్పారు.  నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి రఘువీరారెడ్డిని ఐదు లక్షల మెజార్టీతో గెలిపించాలని కోరారు.