కోకాపేట కేక... రూ.100 కోట్లు దాటిన ఎకరం విలువ

కోకాపేట కేక... రూ.100 కోట్లు దాటిన ఎకరం విలువ

హైదరాబాద్ శివారులోని కోకాపేటలో భూముల వేలం కేక పుట్టిస్తోంది. ఎన్నడూ లేనంతగా  ఆల్ టైమ్ రికార్డు సాధించింది. ప్లాట్ నంబర్ 10 లో ఎకరం రూ.100.25 కోట్లు పలికింది. ఏపీఆర్- రాజ్ పుష్ప మధ్య బిడ్డింగ్ హోరాహోరీగా సాగుతోంది. ప్రస్తుతం ఈ ఆక్షన్ కొనసాగుతోంది.

ఇవాళ నిర్వహించిన రెండో దశ ఈ-వేలంలో రియల్ ఎస్టేట్ సంస్థలు పోటా పోటీగా బిడ్లు దాఖలు చేశాయి. ఉదయం 11 గంటలకు వేలం ప్రక్రియ ప్రారంభమైంది. మైహోం, రాజపుష్ప సంస్థల మధ్య భూములను చేజిక్కించుకునేందుకు తీవ్ర పోటీ నెలకొంది.ఇప్పటి వరకు 6,7,8,9 ,10 ప్లాట్లకు వేలం పూర్తయింది. అత్యధికంగా ఎకరాకు 100.25 కోట్లు అత్యల్పంగా 51.75 కోట్లు పలికింది.   11,14 ప్లాట్లకు వేలం జరుగుతోంది. ఈ 45 ఎకరాల్లో(45.33 ఎకరాలు) ఉన్న ఏడు ప్లాట్‌లను విక్రయించడం ద్వారా రూ.2,500 కోట్ల వరకు సమీకరించుకోవాలని హెచ్‌ఎండీఏ భావిస్తోంది.