మద్యంషాపులకు 10,926 అప్లికేషన్లు

మద్యంషాపులకు 10,926 అప్లికేషన్లు

ఒక్క నల్లగొండ డివిజన్‌‌లోనే 2,188
సర్కారుకు భారీగా  సమకూరిన ఆదాయం
రేపటిదాకా దరఖాస్తుకు అవకాశం

హైదరాబాద్‌‌, వెలుగు: మద్యం దుకాణాల లైసెన్సులకు మస్తు మంది దరఖాస్తు చేసుకుంటున్నరు.. రాష్ట్రంలో మొత్తం 2,216 షాపులు ఉండగా.. ఇప్పటికే 10,926 దరఖాస్తులు అందాయని అధికారులు చెబుతున్నారు. సోమవారం ఒక్కరోజే 6,711 అప్లికేషన్లు వచ్చాయన్నారు. డివిజన్ల వారీగా చూస్తే నల్లగొండ డివిజన్​లో అత్యధికంగా 2,188 దరఖాస్తులు అందాయని చెప్పారు. ఏపీలో దశలవారీగా మద్యనిషేధం అమలు చేస్తామని అక్కడి ప్రభుత్వం ప్రకటించడంతో  సరిహద్దుల్లోని ప్రాంతాలకు పోటాపోటీగా దరఖాస్తు చేస్తున్నారని అన్నారు.

నల్లగొండ తర్వాత వరంగల్​ డివిజన్​లో 2,071 అప్లికేషన్లు రాగా, అత్యల్పంగా హైదరాబాద్​ డివిజన్​లో 237 దరఖాస్తులు మాత్రమే అందాయన్నారు. ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షలు నాన్​ రిఫండబుల్​ ఫీజు వసూలు చేయడంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. బుధవారం వరకు గడువు ఉండడంతో మరిన్ని దరఖాస్తులు అందే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.