NTR 31 Title: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి పవర్ ఫుల్ టైటిల్? నీల్ ప్రీవియస్ సినిమాలకు మించి యాక్ష‌న్‌

NTR 31 Title: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి పవర్ ఫుల్ టైటిల్? నీల్ ప్రీవియస్ సినిమాలకు మించి యాక్ష‌న్‌

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) కు వరల్డ్ వైడ్ గా ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆర్ఆర్ఆర్ హిట్ తరువాత ఆ క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. అందుకే ఆయన సినిమాలపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. అందుకు తగ్గట్టుగానే తన నెక్స్ట్ సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు ఎన్టీఆర్. అందులో భాగంగా వస్తున్న మూవీనే NTR31. ఈ సినిమాను కేజీఎఫ్, సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు.

దీంతో..ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా.. నార్మల్ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.నిజం చెప్పాలంటే..ఎన్టీఆర్ వేరే ఏ సినిమాకు లేని రేంజ్ లో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అవుతోంది. ఇక అనౌన్స్మెంట్ రోజు విడుదల చేసిన పోస్టర్ ఆ అంచనాలని ఆకాశానికెత్తేసింది.అప్పటినుండి ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలువుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.తాజాగా ఈ సినిమా నుండి క్రేజీ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎన్టీఆర్ హీరోయిజం,ఎలివేష‌న్స్ పీక్స్‌లో ఉండబోతున్న ఈ సినిమాకు 'డ్రాగన్' (Dragon) అనే టైటిల్ను ఫిక్స్ చేశాడట నీల్.ఈ సినిమాలో ఫుల్ మాసివ్ రోల్ లో కనిపించబోతున్న తారక్ కు లుక్, క్యారెక్ట‌రైజేష‌న్‌ను దృష్టిలో పెట్టుకొనే ఈ మూవీకి డ్రాగ‌న్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాల‌ని ప్రశాంత్ నీల్ డిసైడ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే ఎన్టీఆర్ 31 టైటిల్‌కు సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. అది కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండుగరోజైన ఆయన పుట్టినరోజున.

అవును..మరి ఈ ప్రాజెక్టు నుండి ఇప్పటికే విడుదలైన ఒక పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేయగా..ఇప్పుడు ఎలాంటి అప్డేట్ ఇస్తారా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  మే 20 ఎన్టీఆర్ పుట్టినరోజున ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ భారీ బ‌డ్జెట్ మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్ ప్రొడ్యూస్ చేస్తోంది.కాగా ప్రస్తుతం ఈ టైటిల్కి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.