చంపి శవంపై కూర్చున్న ఎలుగుబంటి.. ఆరుగురిపై దాడి.. ముగ్గురు మృతి

చంపి శవంపై కూర్చున్న ఎలుగుబంటి.. ఆరుగురిపై దాడి.. ముగ్గురు మృతి

బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ సరిహద్దులోని మహారాష్ట్ర కైలాస్ టేకిడిలో ఎలుగుబంటి ఆరుగురిపై దాడి చేసింది. ఈ ఎలుగుబంటి దాడిలో ‌‌‌ముగ్గురు మృతి చెందారు. మరొక ముగ్గురికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఎలుగుబంటి చంపిన వ్యక్తి శవంపై  కూర్చున్న దృశ్యాలు వణుకు పుట్టించాయి.

దాడికి గురైన వ్యక్తిని అధికారులు జేసీబీతో బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అటవీ అధికారులు బోథ్ సరిహద్దులో హెచ్చరిక జారీ చేశారు. ఉపాధి పనికి వెళ్లవద్దని,  అటవీ ప్రాంతానికి వెళ్లవద్దని ప్రజలను అటవీ శాఖ అధికారులు అప్రమత్తం చేశారు.