హైదరాబాద్: అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన...ఢిల్లీలో విద్యార్థులపై దాడిని ఖండిస్తూ ప్లకార్డుల ప్రదర్శన

హైదరాబాద్: అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన...ఢిల్లీలో విద్యార్థులపై దాడిని ఖండిస్తూ ప్లకార్డుల ప్రదర్శన
  •      లోక్​భవన్​ ముట్టడికి యత్నం 
  •     అరెస్ట్​ చేసిన పోలీసులు 

హైదరాబాద్​సిటీ, వెలుగు: ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడిని ఖండిస్తూ, నీట్ పరీక్షల కుంభకోణానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌ సచివాలయం రోడ్డులో ఉన్న బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం భారీ ఆందోళన నిర్వహించారు. వివిధ విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, సామాజిక సంస్థల ప్రతినిధులు, సివిల్​ సొసైటీ మెంబర్స్​ఇందులో పాల్గొని నిరసన తెలిపారు. వీరికి కాంగ్రెస్, లెఫ్ట్​పార్టీల విద్యార్థి సంఘాల లీడర్లు మద్దతు పలికారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఢిల్లీలో పార్లమెంట్ ను ముట్టడించిన కాక్రోచ్​జనతా పార్టీ, ఇతర విద్యార్థి సంఘాలపై ఢిల్లీ పోలీసులు లాఠీఛార్జ్ చేయడం, ఇంటర్నెట్ నిలిపివేయడం దుర్మార్గమన్నారు. లోక్ భవన్, సెక్రటేరియట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని, పలువురిని అరెస్ట్​చేశారు. సాయంత్రం విద్యార్థులు, యువకులు కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని డిమాండ్​చేశారు.