నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. షేక్‌పేట్ లో1.23, ఆసిఫ్ నగర్ లో 1.18, బంజారా హిల్స్ లో 1.13, శివరాంపల్లిలో 1.10, ముషీరాబాద్ లో1.10, శేరిలింగంపల్లిలో1.03 సెం.మీ. వర్షం కురిసింది. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు అసౌకర్యానికి గురయ్యారు. - హైదరాబాద్ సిటీ, వెలుగు
