మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాస్ అండ్ ఎమోషనల్ డ్రామా చిత్రం 'పెద్ది'. ఈ మూవీ ప్రకటించినప్పటి నుండి దీనిపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్ , టీజర్ మరింత హైప్ ను తీసుకువచ్చాయి. లేటెస్ట్ గా ఈ చిత్రానికి సంబంధించిన వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు కు సంబంధించిన వర్కింగ్ పిక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
గుర్తుపట్టలేనంతగా జగ్గూభాయ్..
ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా అలరించిన జగపతిబాబు, సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. అయితే 'పెద్ది' సినిమాలో ఆయన పోషిస్తున్న 'అప్పలసూరి' పాత్ర మాత్రం గతంలో ఆయన చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఉండబోతోంది. ఫిబ్రవరి 12న జగపతి బాబు పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఒక ప్రత్యేక వర్కింగ్ పిక్‌ను విడుదల చేసింది. ఇందులో దర్శకుడు బుచ్చిబాబు ఒక సీన్ గురించి వివరిస్తుండగా, జగపతి బాబు చాలా ముసలి వ్యక్తిగా, చిరిగిన చొక్కా, కళ్లద్దాలతో పక్కా పల్లెటూరి మనిషిలా కనిపిస్తున్నారు.
►ALSO READ | Lavanya Tripathi: "మా ఫ్యామిలీ జోలికొస్తే ఊరుకోను".. మెగా కోడలు మాస్ వార్నింగ్!
ఆయన మేకోవర్ ఎంత సహజంగా ఉందంటే, మొదటి చూపులో ఆయన జగపతి బాబు అంటే ఎవరూ నమ్మలేనంతగా మారిపోయారు. గతంలో 'రంగస్థలం'లో చరణ్ -జగ్గూభాయ్ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసింది. ఇప్పుడు 'పెద్ది'లో ఈ ఇద్దరి మధ్య వచ్చే సీన్లు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
పాన్ ఇండియా లెవల్లో హవా
ఈ సినిమా కేవలం ఒక ప్రాంతీయ చిత్రం కాదు, ఏకంగా పాన్ ఇండియా రేంజ్‌లో ఐదు భాషల్లో విడుదల కానుంది. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటులు బొమన్ ఇరానీ, దివ్యేందు శర్మ, కమెడియన్ సత్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి బాణీలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'చికిరి' (Chikiri) పాట మిలియన్ల వ్యూస్‌తో రికార్డులు సృష్టించింది.
రిలీజ్ డేట్ ఫిక్స్
తొలుత ఈచిత్రం మార్చిలో విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. 2026, ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా కోసం రామ్ చరణ్ ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. వృద్ది సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. జగపతి బాబు చేసిన ఈ భారీ మేకోవర్ , బుచ్చిబాబు మేకింగ్ స్టైల్ చూస్తుంటే 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద మరో 'రంగస్థలం' రేంజ్ హిట్ కావడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Wishing my dearest @IamJagguBhai garu a very Happy Birthday ❤️❤️❤️🤗🤗🤗 pic.twitter.com/ks3PiKDBbV
— BuchiBabuSana (@BuchiBabuSana) February 12, 2026
