తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. పలు చోట్ల చెదురుముదురు ఘటనలు మినహా.. పెద్దగా అల్లర్లు జరగలేదు. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో జరిగిన ఈ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అభ్యర్థులు గట్టిగానే ప్రయత్నించినట్లు తెలుస్తోంది...వస్తు, నగదు రూపంలో భారీగానే తాయిలాలు సమర్పించుకున్నారు అభ్యర్థులు. అయితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థి ఓటర్లకు షాక్ ఇచ్చాడు. పోలింగ్ ముగిసిన మరుసటిరోజే.. ఓటర్ల ఇళ్లకు వెళ్లి తానూ ఇచ్చిన కుక్కర్లు, గిఫ్ట్ లు వెనక్కి ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మున్సిపాలిటీలో 10వ వార్దు లో కాలనీవాసులు మున్సిపాలిటీ ఎన్నికలకు గిఫ్ట్ లుగా ఇచ్చిన కుక్కర్లు, గిఫ్ట్ లు రోడ్డుపై పడవేసి ఆందోళనకు దిగారు.10వ వార్డులో కొంతమంది వ్యక్తులు అర్ధరాత్రి ఇళ్లకు వచ్చి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేయాలంటూ డబ్బులు కుక్కర్లు ఇవ్వటంతో ఓటర్లు అందరూ తీసుకున్నారు.
►ALSO READ | భారత్ బంద్.. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల నిరసనలు..తెలంగాణలో భారీ ర్యాలీలు
బుధవారం ఎలక్షన్స్ జరిగిన తర్వాత రాత్రి నుండి డబ్బులు కుక్కర్ లు పంచిన వ్యక్తి తమ ఇళ్లకు వచ్చి కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయకుండా మీరు కుక్కర్ లు డబ్బులు ఎందుకు తీసుకున్నారంటూ వేధించారని.. తాము పంచిన గిఫ్ట్ లు కుక్కర్లు వెనక్కి ఇచ్చేయాలని దూషిస్తున్నాడని ఆరోపిస్తున్నారు కాలనీవాసులు.
కాలనీలో మహిళలందరూ తమకు ఇచ్చిన కుక్కర్లు తీసుకువచ్చి... వారి పేర్లు ఆ బాక్సులపై రాసి నడిరోడ్డుపై పడేసి ఆందోళనకు దిగారు. తాము అడగకుండానే తమకు గిఫ్ట్ లు ఇచ్చి ఇప్పుడు వెనక్కి అడగటం ఏమిటని, అసలు ఇంకా కౌంటింగ్ కూడా జరగకుండా ఓట్లు మేము వేయలేదని ఎలా అంటున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఓటర్లు.
