బీజేపీకి మెజారిటీ రాకపోతే ప్లాన్ బి ఉందా?... అమిత్ షా ఏమన్నారంటే..

బీజేపీకి మెజారిటీ రాకపోతే ప్లాన్ బి ఉందా?... అమిత్ షా ఏమన్నారంటే..

కేంద్రంలో  మూడో సారి  అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు  కేంద్ర హోంమంత్రి అమిత్ షా.   ఓ నేషనల్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన మెజారిటీ  272 సీట్లురాకపోతే ప్లాన్ బీ ఉందా అని అడిగిన ప్రశ్నకు ..  అసలు అలాంటి అవసరం లేదని.. ప్రధాని మోడీ అఖండ మెజారిటీతో అధికారంలోకి వస్తారని చెప్పారు.  

 ప్లాన్ ఎ సక్సెస్ రేటు  60 శాతం కంటే తక్కువ  ఉన్నప్పుడే ప్లాన్ బిని అమలు చేయాల్సి ఉంటుంది. నాకు అలాంటి అవకాశాలేవీ కనిపించడం లేదు. ఎందుకంటే 60 కోట్ల లబ్ధిదారుల  సైన్యం ప్రధాని మోడీ వెంట ఉంది. వారికి కులం, వయస్సు లేదు.. ఈ ప్రయోజనాలన్నీ పొందిన వాళ్లకు.. నరేంద్ర మోడీకి 400 సీట్లు ఎందుకివ్వాలనేది తెలుసని అమిత్ షా అన్నారు. 

 ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌లను ఎవరూ ముట్టుకోలేరన్నారు అమిత్ షా.  దేశంలో ఓబీసీలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లకు నరేంద్ర మోదీ కంటే పెద్ద మద్దతుదారు ఎవరూ లేరని చెప్పారు.  ఇండియా కూటమి అధికారంలోకి వస్తే  తాను మళ్లీ జైలు కెళ్లాల్సిన అవసరం లేదన్న కేజ్రీవాల్ వ్యాఖ్యలను అమిత్ షా తప్పుబట్టారు. ఇంతకు మించి కోర్టు ధిక్కరణ ఇంకోటి ఉండదన్నారు.