వైభవా మజాకా.. అతి తక్కు బాల్స్లో సెంచరీ.. దెబ్బకు మరో రెండు రికార్డ్స్ బ్రేక్ !

వైభవా మజాకా.. అతి తక్కు బాల్స్లో సెంచరీ.. దెబ్బకు మరో రెండు రికార్డ్స్ బ్రేక్ !

ఇండియన్ క్రికెట్ లో మరో చరిత్ర నమోదయింది. చరిత్ర పుస్తకాలలో ఇప్పటి వరకు ఉన్న పేర్లను తొలగించి కొంత్త పేరు రాసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే.. చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ మరోసారి రికార్డ్స్ ను తిరగరాసే ఇన్నింగ్స్ ఆడటమే. 14 ఏళ్ల వయసున్న వైభవ్.. పెద్ద పెద్ద స్టార్స్ కు కూడా సాధ్యం కాని రికార్డు నెలకొల్పి క్రికెట్ చరిత్రను షేక్ చేశాడు. 

2025-26 లో రికార్డ్స్ క్రియేట్ చేస్తూ వస్తున్న వైభవ్.. మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో.. వన్డే క్రికెట్ లో..  లిస్ట్-A లో అతి చిన్న వయసులో సెంచరీతో పాటు 150 రన్స్ చేసిన మొనగాడిగా చరిత్ర సృష్టించాడు. అతి తక్కువ బాల్స్ లో డబుల్ సెంచరీ బ్రేక్ చేసే క్రమంలో.. కేవలం 84  బాల్స్ లో 190 రన్స్ చేసి ఔటయ్యాడు. 
ఏబీ డివిలియర్స్ రికార్డు బ్రేక్: 

అరుణాచల్ ప్రదేశ్ పై ఇవాళ (బుధవారం డిసెంబర్ 24) వైభవ్ చేసిన సెంచరీ చరిత్రలో నిలిచిపోతుందని అంటున్నారు క్రికెట్ అనలిస్టులు. వైభవ్ ధాటికి సౌతాఫ్రికా ప్లేయర్ ఏబీ డివిలియర్స్ రికార్డు బద్ధలైంది. గతంలో డివిలియర్స్ 64 బంతుల్లో 150 రన్స్ చేసి చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు ఆ రికార్డును ఎవరూ టచ్ చేయలేదు. కానీ 14 ఏళ్ల కుర్రాడు ఇవాళ డివిలియర్స్ రికార్డును బ్రేక్ చేసి హిస్టరీ క్రియేట్ చేశాడు. 

ఆద్యంతం ఫోర్లు, సిక్సర్లే:

మ్యాచ్ మొత్తం ఫోర్లు సిక్సర్లతో మోత మోగించాడు వైభవ్. బౌలర్లపై విరుచుకుపడుతూ.. 16 ఫోర్లు, 15 సిక్సులతో 190 రన్స్ చేశాడు. 226.19 స్ట్రైక్ రేట్ తో ఇంత స్కోర్ చేయడం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసిందనే చెప్పాలి.  అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ చెలరేగడంతో పలు రికార్డులు బ్రేక్ అయ్యాయి. 

వైభవ్ రికార్డ్స్ ఇదే ఫస్ట్ టైమ్ కాదు. ఐపీఎల్ లో రాజస్థాన్ తరఫున ఆడిన సూర్యవంశీ.. అతిచిన్న  వయసులో, డెబ్యూట్ చేసిన మ్యాచ్ లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. అదే విధంగా ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టౌర్నమెంటులో ఇండియా-A తరఫున 32 బాల్స్ లోనే సెంచరీ చేసి వాహ్వా అనిపించాడు. 

వాస్తవానికి విజయ్ హజారే ట్రోఫీలో అందరి దృష్టి వైభవ్ పైనే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే అతి చిన్న వయసులో రికార్డ్స్ క్రియేట్ చేస్తూ వస్తున్న ఈ కుర్రోడు.. డొమెస్టిక్ క్రికెట్ లో ఎలా పర్ఫామ్ చేస్తాడా అని సెలెక్టర్లు కూడా ఎదురుచూస్తున్నారు. అందరినీ మెస్మరైజింగ్ చేస్తూ.. వైభవ్ ఇండియన్ క్రికెట్ ఫ్యూచర్ ఐకాన్ అన్నట్లుగా ప్రపంచ రికార్డులను నెలకొప్పడం విశేషం.