చెట్లను కాపాడుకుంటే అవి మనల్ని కాపాడతాయి. కాలుష్య కోరల్లో చిక్కుకున్న మనుషుల్ని రక్షించడంలో మొక్కల పాత్ర చాలా ఉంది. ప్రతి ఏడాది ప్రభుత్వాలు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతున్నాయి.అయితే పూజా కార్యక్రమాల్లో చాలా రకాల ఆకులు, పండ్లు వాడతారు. నైవేద్యంగా కూడా పెడతారు.
అవి భగవంతుడికి సమర్పించడం వల్ల పాపాలు తొలగుతాయని, పుణ్యం, వేస్తుందని భక్తులు నమ్ముతారు. కానీ దేవుడికి అర్పించే పత్రాలు, ఫలాల వెనుక ఆధ్యాత్మిక రహస్యాలే కాదు... ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. పూజా కార్యక్రమాల్లో ఆకులు, పండ్లవల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఆ ఆకుల్లో ఉన్న ఔషధగుణాలు ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. పండ్లు తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఏ ఆకువల్ల ఎలాంటి మేలు జరుగుతుందో, ఏ పండ్ల వల్ల ఎలాంటి సమస్యలు తగ్గుతాయో తెలుసుకుందాం ...
ఆకుల్లో ఆరోగ్యం
భగవంతుడిని అనేక రకాలైన ఆకులతో పూజిస్తారు. ఒక్కోరకం ఆకును సమర్పించడంలో ఒక్కో రకమైన ఆరోగ్య సూత్రం ఉంది.
తులసి.. జబబు, దగ్గు, జ్వరాలను తగ్గిస్తుంది. గాయాలనూ మాన్పుతుంది. సౌందర్య లేపనంగా కూడా తులసిని వాడతారు.
ధవనం: దీనినే మరువం అని కూడా అంటారు. మంచి వాసన వస్తుంది. ఇది జీర్ణవ్యవవస్థను కాపాడుతుంది. జుట్టురాలే సమస్యను కూడా
తగ్గిస్తుంది.
మారేడు: విరోచనాలు, మధుమేహం, జ్వరం, కళ్ల సమస్యలు తగ్గించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది.
మాచిపత్రి : మంచి సువాసన వెదజల్లుతుంది. చర్మంపై వచ్చే దద్దుర్లు, కంటి సమస్యలు.. తలనొప్పి తగ్గిస్తుంది.
మామిడాకు: వీటిని ద్వారానికి తోరణాలుగా కడతారు. శుభకార్యాలప్పుడు ఎక్కువగా వాడతారు. అయితే మామిడాకుల వల్ల ఇంట్లోకి క్రిమికీటకాలు రావు రక్తపు విరోచనాలు తగ్గడానికి కూడా మామిడాకులు. ఉపయోగపడతాయి.
రావి.. ఇవి జ్వరం, నోటిపూత తగ్గడానికి ఆయుర్వేదంలో వినియోగిస్తారు. ఇంకా వీటి వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుందని.. జ్ఞాపకశక్తి పెరుగుతుందని కూడా చెప్తారు.
గరిక.. దీనిని పూజలో ఎక్కువగా వాడుతుంటారు. దీనివల్ల చర్మంపై వచ్చే దద్దులు, మచ్చలు నివారించవచ్చు. మూత్రంలో మంట, మొలలు వంటి వ్యాధులకు దీనిని వాడతారు.
రేగు.. ఈ ఆకు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయడానికి ఉపయోగపడతుంది. రక్తానికి సంబంధించిన వ్యాధులను నయం చేయడానికి తయారు చేసే మందుల్లో దీనిని వాడతారు.
ఉత్తరేణి: ఇది ఎక్కువగా దంత సమస్యలతో బాధపడే వాళ్లకు ఉపయోగపడుతుంది. రక్తం కారడం, చెవి నొప్పి, కిడ్నీలలో రాళ్ల తగ్గించడానికి కూడా ఉత్తరేణి పనికొస్తుంది.
గన్నేరు... ఇది కణుతులు తగ్గించడానికి, తేలు, విషకీటకాల కుట్టినప్పుడు పనికివస్తుంది. దురద, కళ్లు, చర్మ సంబంధమైన వ్యాధులను దూరం చేస్తుంది.
పండ్లతో ప్రయోజనాలు
దేవుడికి సమర్పించిన పండ్లను పూజ పూర్తి అయిన తర్వాత భక్తులు తింటారు. వాటిని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తీరతాయి. భక్తికి, శరీర రక్షకు ఉపయోగపడే అలాంటి పండ్ల గురించి తెలుసుకుందాం.
అంటి... అరటి పళ్లు దేవుడికి సమర్పిస్తే పనులు త్వరగా పూర్తి అవుతాయని భక్తులు నమ్మకం. ఎక్కువగా నైవేద్యంలో అరటి పండ్లు పెడతారు. వీటిని తినడం వల్ల డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలు తగ్గుతాయి. అరటి.డ్లలో ఉండే విటమిన్ బి 9 శరీరంలో సెరటోనిన్ లెవల్స్ ను పెంచుతుంది. మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది.
కొబ్బరికాయ: కొబ్బరికాయ కొడితే పనులు పూర్తవుతాయని, అధికారుల నుంచి సమస్యలు ఎదురుకావని అంటారు. దీనిలో నలభై తొమ్మిది శాతం లారిక్ యాసిడ్ ఉంటుంది. తల్లి పాలకు దాదాపు సరిసమానం. కొబ్బరినూనెలో ఉండే పాటియాసిడ్స్, వైరల్, ఫంగల్, బ్యాక్టీరియల్ వంటి మానవజాతి ఎదుర్కునే రుగ్మతలను తగ్గించడంలో సహాయపడతాయి.
మామిడి... ఈ పండు దేవుడికి సమర్పిస్తే గృహనిర్మాణ పనులు త్వరగా జరుగుతాయని, బకాయిలు వసూలు అవుతాయని నమ్ముతారు. వీటిలో ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును తగ్గిస్తాయి. ఇంకా మామిడి పండ్లలో ఉండే విటమిన్ సి, ఫైబర్ చెడు కొప్పును తగ్గిస్తాయి. జీర్ణ సంబంధ సమస్యలను దూరం చేస్తాయి.
మేడి.. మేడిచెట్టులో దత్తాత్రేయుడు ఉంటాడని నమ్ముతారు. మేడి కాయలు తింటే చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు పోతాయి. అలాగే శరీర దృఢత్వం పెరుగుతుంది.
ఉసిరి.. దేవుడికి అత్యంత ఇష్టమైనవి ఉసిరి కాయలు వీటిల్లో పోషకాలు, విటమిన్ సి ఉంటాయి. మలబద్దకం మధుమేహం లాంటి సమస్యలు ఇవి తినడం వల్ల తగ్గుతాయి.
లక్ష్మణఫలం.. ఇవి పూజలో వాడతారు. వీటి కాయలు క్యాన్సర్ నివారణకు ఉపయోగిస్తారు. పైత్యం లాంటి రోగాల తగ్గించడానికి వాడతారు.
మాదీఫలం.. మాదీఫలం శివుడికి అత్యంత ఇష్టమైనది. చండీహోమంలో ప్రధానంగా వాడతారు. వీటిని దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తే ఆనారోగ్య సమస్యలు తొలుగుతాయని అంటారు. ఈ కాయలను ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు. పైత్య సంబంధమైన రోగాలు తగ్గడానికి ఈ పండ్లు తింటారు.
