భర్త సాఫ్ట్ వేర్.. భార్య బ్యాంక్ ఉద్యోగి : విడాకులపై కోర్టుకు వచ్చి వెళుతున్న భార్యను తుపాకీతో కాల్చి చంపాడు

 భర్త  సాఫ్ట్ వేర్.. భార్య బ్యాంక్ ఉద్యోగి : విడాకులపై కోర్టుకు వచ్చి వెళుతున్న భార్యను తుపాకీతో కాల్చి చంపాడు

అతనొక సాఫ్ట్‌వేర్, ఆమె ఒక బ్యాంక్ ఉద్యోగి.. ఇద్దరిది మంచి ఉద్యోగం... పెళ్లి అయ్యాక అంత సవ్యంగానే ఉన్న కొన్నాళ్లకే ఇద్దరి మధ్య విబేధాలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. దింతో విడివిడిగా ఉంటు విడాకులు తీసుకోవాలి అనుకున్నారు. ఏం జరిగిందో తెలీదు..  విడాకుల కోసం కోర్టుకు వచ్చిన భార్యని భర్త తుపాకీతో కాల్చి చంపడం సంచలనం సృష్టించింది.  ఇదంతా బెంగళూరులోని బసవేశ్వరనగర్‌లో  జరిగింది. 

పోలీసుల సమాచారం ప్రకారం...  తమిళనాడుకు చెందిన బాల మురుగన్, భువనేశ్వరి ఇద్దరు భార్యాభర్తలు. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో వారు విడివిడిగా ఉంటూ కోర్టులో విడాకుల అప్లయ్ చేసారు. 

మంగళవారం సాయంత్రం కోర్టు విచారణ అయిపోయాక భువనేశ్వరి తిరిగి వస్తుండగా బసవేశ్వరనగర్‌లోని ఒక హోటల్ దగ్గర బాల మురుగన్ ఆమెను అడ్డుకున్నాడు. అక్కడ ఇద్దరి మధ్య గొడవ పెద్దదవ్వడంతో తన దగ్గర ఉన్న తుపాకీతో భార్య పై కాల్పులు జరిపాడు.

 మొత్తం నాలుగు సార్లు కాల్పులు జరపగ... రెండు బుల్లెట్లు ఆమె తలకు, మరో రెండు ఛాతికి తగిలాయి. దింతో తీవ్ర రక్తస్రావం కావడంతో భువనేశ్వరి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అయితే హత్య చేసిన వెంటనే బాల మురుగన్ స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

బాల మురుగన్ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కాగా, భువనేశ్వరి ఒక బ్యాంకు ఉద్యోగి. అతను వాడిన తుపాకీకి లైసెన్స్ ఉందా ? లేదా ? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. కుటుంబ కలహాలే ఈ హత్యకు అసలు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.