ఐటీఐ లిమిటెడ్లో 215 ఉద్యోగాలు.. ఐటిఐ, డిగ్రీ, బిటెక్ పాసైనవాళ్లకి మంచి అవకాశం..

 ఐటీఐ లిమిటెడ్లో 215 ఉద్యోగాలు.. ఐటిఐ, డిగ్రీ, బిటెక్ పాసైనవాళ్లకి మంచి అవకాశం..

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ITI  limited) ప్రాజెక్ట్స్, ఐఎస్ & ఐటీ, ప్రొడక్షన్, టెలికాం సెక్యూరిటీ టెస్టింగ్ ల్యాబ్, హెచ్ఆర్, మార్కెటింగ్, ఫైనాన్స్, అఫీషియల్ లాంగ్వేజ్ వంటి పలు డొమైన్లలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన గ్రాడ్యుయేట్, డిప్లొమా, ఐటీఐయంగ్ ప్రొఫెషనల్ భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల స్వీకరణ డిసెంబర్ 22 నుంచి ప్రారంభమవుతుంది. ఆఖరు తేదీ 2026, జనవరి 12. 

పోస్టుల సంఖ్య: 215 (యంగ్ ప్రొఫెషనల్స్)

విభాగాల వారీగా ఖాళీలు: ప్రాజెక్ట్స్ 55, ఐఎస్ & ఐటీ 04, కంప్యూటర్ ల్యాబ్ 46, టెలికాం సెక్యూరిటీ టెస్టింగ్ ల్యాబ్ 5, ప్రొడక్షన్/ మాన్యుఫాక్చరింగ్ 52, హెచ్ఆర్ 15, మార్కెటింగ్ 20, ఫైనాన్స్ 10, హిందీ సెల్ 04.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ కళాశాల నుంచి సంబంధిత విభాగంలో ఎంసీఏ/ ఎంఎస్సీ, ఎంబీఏ, బి.టెక్./ బీఈ,   బీఎస్సీ, బీసీఏ/ డిప్లొమా, ఏదైనా డిగ్రీ, ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: డిసెంబర్ 22.

లాస్ట్ డేట్: 2026, జనవరి 12.

సెలెక్షన్ ప్రాసెస్
యంగ్ ప్రొఫెషనల్ - గ్రాడ్యుయేట్స్: షార్ట్​లిస్ట్ చేసిన అభ్యర్థులను గ్రూప్ డిస్కషన్ (జీడీ), పర్సనల్ ఇంటర్వ్యూ (పీఐ)లకు పిలుస్తారు. నిబంధనల ప్రకారం జీడీ, పీఐల్లో పనితీరు ఆధారంగా తుది మెరిట్‌ను ప్రకటిస్తారు.

యంగ్ ప్రొఫెషనల్ - టెక్నీషియన్లు & ఆపరేటర్స్: షార్ట్​లిస్ట్ చేసిన అభ్యర్థులకు సంబంధిత ట్రేడ్​లో స్కిల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.

పూర్తి వివరాలకు itiltd.in వెబ్​సైట్​ను సందర్శించండి.