భారతదేశం ఉలిక్కిపడింది.. దేశం అనే కంటే దేశంలోని భర్తలు అమ్మో అమ్మో అని గుండెలు బాదుకుంటున్న ఘటన ఇది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2025, నవంబర్ నెలలో భర్తను చంపిన భార్య.. ఆ తర్వాత మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చింది.. 40 రోజుల తర్వాత బాడీ దొరికినా.. ఆ భార్య నిర్వాకం బయటపడలేదు.. ఒకే ఒక్క టాటూ.. టీ షర్ట్ ద్వారా ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. రియల్ క్రైం థ్రిల్లర్ స్టోరీని మీరూ చదివేయండీ..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సంభాల్ ఏరియా. రాహుల్, రూబీ భార్యభర్తలు. వీళ్ల మధ్యలోకి గౌరవ్. వీడు రూబీ ప్రేమికుడు. నవంబర్ 17వ తేదీ రాత్రి భర్త రాహుల్ డ్యూటీకి వెళ్లాడు. భార్య రూబీ.. తన ప్రేమికుడు గౌరవ్ ను ఇంటికి పిలిచింది. అర్థరాత్రి తర్వాత 2 గంటల ప్రాంతంలో భర్త రాహుల్ అనుకోకుండా ఇంటికి వచ్చాడు. భార్య రూబీతో ఉన్న గౌరవ్ ను చూశాడు. విషయం అర్థం అయ్యింది. గొడవ జరిగింది. ఈ గొడవలో భర్త రాహుల్ తలపై బలమైన రాడ్డుతో కొట్టింది భార్య రూబీ. ఒకే ఒక్క దెబ్బతో చచ్చిపోయాడు భర్త రాహుల్.
చనిపోయాడు కదా.. మరి కేసు, జైలు అని అప్పుడు గుర్తుకొచ్చింది రూబీకి. వెంటనే ప్రేమికుడు రాహుల్ ద్వారా ప్లాన్ వేసింది. పెద్ద మెషీన్ రంపం తీసుకొచ్చారు. భర్త రాహుల్ తలను కోసేశారు. కాళ్లు, చేతులు వేరు చేశారు. ఆ తర్వాత నల్లటి పెద్ద కవర్లలో తల, మొండం, కాళ్లు, చేతులు వేర్వేరుగా.. వేర్వేరు ప్రాంతాల్లో పడేశారు.
ALSO READ : హైదరాబాద్ ఉప్పల్ భగాయత్ లేఅవుట్ లో అగ్ని ప్రమాదం..
అంతా అయిపోయింది.. పని ఫినిష్ అయ్యింది.. అంతా హ్యాపీ అనుకున్నారు రూబీ, గౌరవ్. మరి భర్త రాహుల్ ఎక్కడ అని బంధువులు అడిగితే ఏం చెప్పాలి. అందుకే చంపిన 2 రోజుల తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి నా భర్త రాహుల్ కనిపించటం లేదు అంటూ కంప్లయింట్ చేసింది భార్య రూబి. పోలీసులు వెతికారు.. ఆధారాలు దొరకలేదు. ఆ తర్వాత అంతా సైలెంట్.
2025, డిసెంబర్ 15వ తేదీన సంభాల్ ప్రాంతానికి దూరంగా ఉన్న ఓ దర్గా సమీపంలో ఓ నల్లటి కవర్ లో మనిషి ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులు సమాచారం వచ్చింది. ఫోరెన్సిక్ టీంతో వెళ్లిన పోలీసులు.. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మనిషి మొండెంను స్వాధీనం చేసుకున్నారు. ఎవరు అనేది గుర్తించటం కోసం అన్ని పోలీస్ స్టేషన్లకు మిస్సింగ్ వ్యక్తుల సమాచారం కావాలని సమాచారం ఇచ్చారు. రాహుల్ అనే వ్యక్తి కూడా మిస్సింగ్ అని సమాచారం వచ్చింది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు.
బాడీ గుర్తింపు కోసం భార్య రూబిని పిలిపించారు. అప్పటికే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా.. మొండెంపై ఉన్న టాటూ, శరీరంపై ఉన్న టీ షర్ట్ ఆనవాళ్లు చెప్పి.. రూబిని గుర్తించమన్నారు. ఆమె మాత్రం ఇది నా భర్తది కాదు అని చెప్పింది. పోలీసులు కూడా మొదట ఓకే అన్నారు.. ఆ తర్వాత ఎందుకో డౌట్ వచ్చింది. మిస్సింగ్ కంప్లయింట్ లో ఉన్న విషయాలకు.. ఇప్పుడు చెబుతున్న మాటలకు పొంతన లేదు అని డౌట్ వచ్చింది. వెంటనే భార్య రూబి ఫోన్ తీసుకున్నారు. చెక్ చేశారు. షాక్.. బాడీతో పాటు దొరికిన టీ షర్ట్.. రూబి మొబైల్ లో ఉన్న ఫొటోల్లో ఒక ఫొటో మ్యాచ్ అయ్యింది. ఆ వెంటనే నాలుగు పీకారు పోలీసులు. మొత్తం కక్కేసింది.
లవర్ తో ఇంట్లో ఉన్న సమయంలో భర్త వచ్చాడని.. గొడవలో చంపేసినట్లు చెప్పింది. ఆ తర్వాత భయపడి భర్త శరీరాన్ని ముక్కలుగా చేసి పారేసినట్లు వెల్లడించింది. రూబి విచారణ తర్వాత ప్రియుడు గౌరవ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. మొత్తానికి రియల్ క్రైం థ్రిల్లర్ స్టోరీ.. ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తుంది.
