హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పల్ భగాయత్ HMDA లేఔట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉప్పల్ భగాయత్ లోని లిమ్రా పరుపుల షాప్ లో మంటలు చెలరేగాయి.
వాటర్ ట్యాంక్ కు కరెంట్ కనెక్షన్ ఇవ్వబోతుంటే వైర్ మీద పడడంతో ఒక్కసారి మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. స్థానికుల సమచారంతో ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు. ప్రమాదం ధాటికి షాప్ పూర్తిగా దగ్గమైంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.. కానీ సుమారు రూ. 25 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
