పంచాయతీలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి.. కొత్త సర్పంచ్లకు సీఎం రేవంత్ సూచనలు

పంచాయతీలను ఆదర్శ గ్రామాలుగా  తీర్చిదిద్దాలి.. కొత్త సర్పంచ్లకు సీఎం రేవంత్  సూచనలు

తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీల్లో నూతన పాలక వర్గం కొలువు దీరింది.  ఈ క్రమంలో  రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్ లుగా, ఉప సర్పంచ్ లుగా, వార్డు మెంబర్లుగా బాధ్యతలు స్వీకరించిన సోదర సోదరీమణులకు  సీఎం రేవంత్ రెడ్డి విషెస్ చెప్పారు.  మంచి పాలన అందించి, పంచాయతీలను ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్ది..  ప్రజల మన్ననలు పొందాలని కోరారు.

రాష్ట్రవ్యాప్తంగా పల్లెల్లో కొత్త పాలన మొదలైంది. దాదాపు రెండేండ్ల తర్వాత కొత్త పాలకవర్గాలు డిసెంబర్ 22న  కొలువుదీరాయి. 12,702 పంచాయతీలకు సర్పంచులు, ఉపసర్పంచులు, 1,11,803 వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొన్నది. సర్పంచులు సొంత ఖర్చులతో ఆఫీసులకు రంగులు వేయించారు. పలువురు సర్పంచులు బాజాబజంత్రీలు, ఊరేగింపులతో వచ్చి బాధ్యతలు స్వీకరించగా.. మరికొందరు గెలిచిన తొలిరోజే హామీల అమ‌‌‌లుకు శ్రీకారం చుట్టారు. 

ALSO READ : సింగూరును పర్యాటకంగా అభివృద్ధి చేయండి

పలుచోట్ల చిన్నచిన్న ఘర్షణలు, గందరగోళం మినహా రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాణస్వీకార కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి. పలుచోట్ల పాల‌‌‌‌క వ‌‌‌‌ర్గాల ప్రమాణస్వీకారోత్సవాలు కన్నులపండువగా జరిగితే ఇంకొన్నిచోట్ల వసతుల లేమితో ఇబ్బందిపడ్డారు. నిర్మల్ జిల్లా తానూర్ మండలం బొంద్రాట్ సర్పంచ్ రవీందర్ పటేల్ గుర్రంపై బాజాబజంత్రీల నడుమ ఊరేగింపుగా వచ్చి బాధ్యతలు స్వీకరించారు.