యూఎస్ నేవీకి ఓ పక్షి వల్ల 14కోట్లు నష్టం వచ్చింది. పటుక్సెంట్ నది దగ్గర్లోని నావల్ ఎయిర్ స్టేషన్‌లో ఈ –6బీ మెర్య్కురీ ఎయిర్‌క్రాఫ్ట్‌కు ఈ నెల మొదటివారంలో అధికారులు ఎయిర్‌టెస్ట్ చేశారు. ఆటైంలో ఓ పక్షి ఎయిర్‌క్రాఫ్ట్‌లోని ప్రొపెల్లర్ ఒకదానిలో ఇరుక్కుందని, దాని వల్ల ఎయిర్‌క్రాఫ్ట్ పాడైపోయిందని అధికారులు చెప్పారు. ఇంజిన్‌ను రిప్లేస్ చేసి ఎయిర్‌క్రాఫ్ట్‌ను తిరిగి ఉపయోగించారు. దీని వల్ల 14 కోట్లు నష్టం కలిగిందని అధికారులు వివరించారు.

