20 ఏళ్ల క్రితం బర్గర్.. నేటికీ ఇప్పుడే చేసినట్టుగా..

20 ఏళ్ల క్రితం బర్గర్.. నేటికీ ఇప్పుడే చేసినట్టుగా..

సరిగ్గా 20 ఏళ్ల క్రితం.. 1999లో అమెరికాలోని ఓ షాప్‌లో తీసుకున్న బర్గర్.. నేటికీ ఫ్రెష్‌గా అలానే ఉంది. చెక్కు చెదరకుండా అలాగే ఇప్పుడే చేసినట్టుగా ఉన్న ఆ బర్గర్‌ని చూసి దాన్ని కొన్న వ్యక్తి షాక్ అయ్యాడు. ఇది చదువుతుంటే ఎవరైనా షాక్ అవడం మామూలే. ఫుడ్ ఏంటీ ఇన్నాళ్ల పాటు ఏ మాత్రం పాడవకుండా ఉండడమేంటని అనుమానం రాకమానదు. అయితే ఇది నిజమేనని చెబుతున్నాడు దాన్ని కొన్న వ్యక్తి డేవిడ్ విపెల్.

భార్య పడేసుంటుందనుకున్నా..
1999లో లగాన్‌లోని ఓ స్టోర్‌లో మెక్‌డొనాల్డ్స్ బర్గర్ కొన్నానని చెబుతున్నాడు డేవిడ్. వాస్తవానికి దానిపై ఎంజైమ్స్ ఎక్స్‌పరిమెంట్ చేద్దామని అనుకున్నాడట. కానీ దాన్ని ఓ కోట్ పాకెట్‌లో పెట్టి.. దాన్ని తన కారు వెనుక సీటులో పడేసి మర్చిపోయాడతను. అయితే ఆ తర్వాత అతడి భార్య ఆ కోట్‌లో బర్గర్ ఉన్న విషయం మర్చిపోయి.. దాన్ని భద్రంగా ఇంట్లోకి తెచ్చి సెల్ఫ్‌లో దాచింది. ఈ విషయం డేవిడ్‌కు తెలియదు. ఆ తర్వాత కొన్ని రోజులకు వాళ్లు లగాన్ నుంచి సెయింట్ జార్జ్ ప్రాంతానికి షిఫ్ట్ అయ్యారు. మళ్లీ రెండేళ్ల తర్వాత పాత ఇంటికి వచ్చారు. అప్పుడు కూడా ఆ కోట్‌ను తాను చూడలేదని చెబుతున్నాడు డేవిడ్. తన భార్య దాన్ని ఎప్పుడో పడేసి ఉంటుందని అనుకున్నానని అన్నాడు. 2013లో తొలిసారి అనుకోకుండా ఆ కోట్‌ను తీసిన డేవిడ్.. అందులో బర్గర్‌ను చూసి షాక్ అయ్యాడు.
అన్నేళ్లుగా అలానే ఫ్రెష్‌గా ఇప్పుడే చేసిన బర్గర్‌లా ఉండడంతో ఆశ్చర్యపోయాడు. బ్రెడ్, బర్గర్ పైభాగం అంతా యథావిధిగా ఉన్నా.. దానిలోని చికెన్ మాత్రం కప్‌బోర్డ్ స్మెల్ వస్తోందట. అయితే అంత కాలం అలానే ఉన్న బర్గర్‌ను ఇంకొన్నాళ్లు ఉంచి చూద్దామనుకున్నాడు డేవిడ్. దాన్ని ఒక బాక్స్‌లో పెట్టి లాక్ చేశాడు. ఇటీవల మళ్లీ దాన్ని చెక్ చేస్తే అలానే ఉందని అతడు చెబుతున్నట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ తెలిపింది.