Kannappa Movie: కన్నప్ప షూట్ కంప్లీట్ చేసిన అక్షయ్.. ఏ పాత్ర కోసమో తెలుసా?

Kannappa Movie: కన్నప్ప షూట్ కంప్లీట్ చేసిన అక్షయ్.. ఏ పాత్ర కోసమో తెలుసా?

మంచు ఫ్యామిలీ(Manchu Family) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా కన్నప్ప. దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెట్ తో అవా క్రియేషన్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మంచు విష్ణు(Manchu Vishnu) ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇండియా వైడ్ గా ఉన్న చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. వారిలో.. ప్రభాస్, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ ఉన్నారు. తాజాగా ఈ లిస్టులో చేరాడు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్. 

ఇటీవలే ఆయన కన్నప్ప షాట్ కోసం హైదరాబాద్ వచ్చారు. దానికి సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తాజాగా సమాచారం ప్రకారం అక్షయ్ కుమార్ తన పాత్రకు సంబందించిన షూట్ ను కంప్లీట్ చేశారట. ఇదే విషయాన్ని తెలియజేస్తూ.. అప్డేట్ ఇచ్చాడు హీరో మంచు విష్ణు. అయితే.. అక్షయ్ కుమార్ ఈ సినిమాలో ఏ పాత్రలో కనిపించనున్నాడు అనే విషయంపై చాలా చర్చలు జరుగుతున్నాయి. 

వాటి ప్రకారం.. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ మహాశివుడి పాత్రల్లో కనిపించనున్నాడని టాక్. ఇటీవల అక్షయ్ కుమార్ ఓ మై గాడ్ 2 సినిమాలో శివుడి పాత్రలో కనిపించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. అందుకే ఆయనను శివుడి పాత్ర కోసమే తీసుకున్నారని, ఆ పాత్రకి సంబందించిన షాట్ తాజాగా కంప్లీట్ అయిందని తెలుస్తోంది.

నిజానికి.. కన్నప్ప సినిమాలో శివుడి పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడని వార్తలు వైరల్ అయ్యాయి. అందరు అది నిజమే అని నమ్మారు కూడా. మంచు విష్ణు కూడా అదే విషయంపై ట్వీట్ వేసి చిన్న హింట్ కూడా ఇచ్చాడు. దాంతో కన్నప్ప సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. కానీ, తాజాగా సమాచారంతో కొంతమంది డిజప్పాయింట్ అవుతున్నారు. శివుడిగా ప్రభాస్ అయితేనే బాగుంటుందని ఓపెన్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే.. ఈ రెండు విషయాలపై మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.